26.7 C
Hyderabad
April 27, 2024 09: 26 AM
Slider అనంతపురం

రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు

WhatsApp Image 2021-10-17 at 16.13.19

కృష్ణా ట్రిబ్యునల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలపై అధికారం చెలాయించేందుకు కేంద్ర ప్రయత్నిస్తున్నదని అనంతపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ టీడీపీ నేతలు ఆదివారం సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. సీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారని పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎమాత్రం లేదని ఆక్షేపించారు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు, అనంత జిల్లాలోని అన్ని చెరువులకు వెంటనే నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts

విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam NEWS

కొలాప్స్: చంద్రబాబునాయుడి పదవికి ఫొటో ఫినిష్

Satyam NEWS

పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment