28.7 C
Hyderabad
April 28, 2024 09: 56 AM
Slider మహబూబ్ నగర్

కుల వృత్తులు, పాడి రైతుల అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి

#tallojuachari

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కులాలకు అందించే ఆర్థిక మద్దత్తు పథకాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఉద్బోదించారు.

 శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ అండ్ బి అతిథి గృహంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వెనుకబడిన తరగతుల కులాల కు ఆర్థిక స్వావలంబన ముద్ర ఆత్మ నిర్భర్ భారత్ లోన్స్ పై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఆర్థిక మద్దత్తు పథకాలను ప్రవేశపెట్టి సబ్సిడి రూపంలో డబ్బును ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బ్యాంకర్లు ఈ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బీసీ కులాల ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రౌండింగ్ పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాండ్ అప్ ఇండియా, స్మార్ట్ అప్ ఇండియా, ముద్ర పథకాలను ప్రజలకు అందించేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. స్వయం సహాయక బృందాల విషయమై మాట్లాడుతూ రుణాలు చెల్లించే విషయంలో ఏదైనా సమస్యలుంటే బ్యాంకర్లు వారితో మాట్లాడి సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పాడి రైతులకు అందించే రుణాల కోసం 303 మంది అప్లై చేసుకోగా ఒక్కరికి కూడా లోను ఇవ్వకుండా తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు.

ఈ అంశంపై బ్యాంకర్లు వివరణ ఇస్తూ పాల డైరీ నుండి వచ్చే రాబడి అకౌంట్లు ఇతర బ్యాంకుల్లో ఉండటంవల్ల లోన్లు అందించలేకపోయామని వివరించగా అందుకు ఆయన స్పందిస్తూ పాడి రైతులతో మాట్లాడి పాడి రైతుల అకౌంట్లును రుణాలు అందించే బ్యాంకు లోనే అకౌంట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆదేశించారు. అభివృద్ధిలో బ్యాంకర్లు బాగస్వాములై నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్థిక మద్దత్తు పథకాలు అర్హులైన వారికి చేరేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేసిన లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

ఆర్థిక మద్దత్తు పథకాల కింద యూనిట్ మంజూరు చేసి గ్రౌండింగ్ అయ్యేలా చూడటంలో బ్యాంకర్ల పాత్ర క్రీయశీలకమైందన్నారు. అదేవిధంగా ఎంతోమంది పేద ప్రజలు తమకు అవగాహన లేకపోవడం వల్ల  ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జీవన్ జ్యోతి, జీవన్ బీమా పథకాలను అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి జీవన్ భీమా పథకం క్రింద సంవత్సరానికి 12 రూపాయలు చెల్లిస్తే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ప్రమాదం జరిగి మరణిస్తే రెండు లక్షల రూపాయలు బీమా సదుపాయం అందుతుందన్నారు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం కింద సంవత్సరానికి 330 రూపాయలు చెల్లిస్తే ప్రమాద మరణం తో పాటు సాధారణ మరణం సంభవిస్తే అట్టివారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు అందుతాయన్నారు.

పేద ప్రజల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చే బీమా పథకాలను జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద పనిచేసే ప్రతి కూలీలకు నిర్బంధంగా 330 రూపాయలు అమలు చేస్తూ ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యేవిధంగా అమలు చేయాలని భారత ప్రధాన మంత్రికి తెలియజేయడం జరిగింది అన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 60 శాతం మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరడం ఉన్నట్లు ఆయన తెలిపారు. బీమా పథకాలను నమోదు చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధుల నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బ్యాంకులో అకౌంట్ ఉన్న పేద ప్రజలకు తెలియజేయాలన్నారు.

మున్సిపాలిటీల్లో నిర్వహించే వీధి వర్తక దారులకు కేంద్ర ప్రభుత్వం అందించే  పదివేల రుణాలు సకాలంలో చెల్లించే వారికి 20 వేల రూపాయలు ఆ తర్వాత 50 వేల రూపాయల రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించిన ఉందని, వీధి వర్తక దారుల అందరూ తప్పనిసరిగా రుణాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ప్రభుత్వం అందించే చేయూతో మరింత అభివృద్ధి చెందే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌన్సిల్ కిషోర్ పాండ్యా, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, చీఫ్ మేనేజర్ జోగులాంబ శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ ఎస్బిఐ మహబూబ్ నగర్ ప్రతాప్ బాబు, చీఫ్ మేనేజర్ ఎస్బిఐ నాగర్ కర్నూల్ శ్రీనివాసులు, జర్నల్ మేనేజర్  సుబ్రహ్మణ్యం, యూనియన్ బ్యాంక్ ఎజియం రాంప్రసాద్, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చెట్టుకు ఊరేసుకొని గీత కార్మికుడు మృతి

Bhavani

ఒకరి ప్రాణం తీసిన లూడో గేమ్ గొడవ

Bhavani

విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నది….. అనుకుంటున్నారా?

Satyam NEWS

Leave a Comment