27.7 C
Hyderabad
April 26, 2024 05: 32 AM
Slider పశ్చిమగోదావరి

ఆగస్టు 15 కల్లా బేస్ బెంట్ స్థాయి వరకూ పూర్తి కావాలి

#pedavegi

పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఆగస్టు 15 నాటికి గృహ నిర్మాణాలు బేస్ మెంట్ స్థాయికి పూర్తిచేయాలని సచివాలయ ఇంజనీర్ లను గృహనిర్మాణ శాఖ డి ఈ రమాకాంత్ ఆదేశించారు. నియోజక వర్గంలో 18వేల736 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు ప్రభుత్వం పంపిణీ చేసిందని గృహ నిర్మాణశాఖ డి ఈ రమాకాంత్ అన్నారు.

ఒక్క పెదవేగి మండలంలో6 వేల136 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేయగా వారిలో 5 వేల 426 మంది లబ్ధిదారులు కాలనీ గృహాలు నిర్మించుకోడానికి ముందుకొచ్చారని చెప్పారు. పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సచివాలయాల కార్యదర్సులతో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో గృహ నిర్మాణాల దశలపై ఆరాతీశారు. మండలంలో 4 వేల 380 మంది లబ్ధిదారులు నిర్మించబోయే ఇళ్ళ నిర్మాణాలకు స్థానిక ఎం ఎల్ ఏ కోటారు అబ్బయ్య చౌదరి  శంకుస్థాపనలు చేశారని డి ఈ చెప్పారు.

అదేవిధంగా దెందులూరు మండలంలో 3 వేల 718.ఏలూరు మండలం లో 1వెయ్యి 501 పెద్దపాడు మండలంలో 3వేల 502 గృహ నిర్మాణాలు చేపట్టనున్నట్టు డి ఈ రమాకాంత చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎం డి ఓ బలరామరాజు డి టి జయశ్రీ మండల వై సి పి నాయకులు మెడికొండ కృష్ణారావు.గుత్తా ప్రసాద్.కేసిన సతీష్ హౌసింగ్ ఏ ఈ వివేకానందరవు పాల్గొన్నారు.

రుషి జర్నలిస్ట్

Related posts

New strategy: నితీష్ తో చేతులు కలపబోతున్న ప్రశాంత్ కిషోర్

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి విశిష్టత

Satyam NEWS

అనాధ బాలునికి ఆర్థిక సహాయం అందజేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్

Satyam NEWS

Leave a Comment