36.2 C
Hyderabad
April 27, 2024 22: 36 PM
Slider ఖమ్మం

వినూత్నంగా బతుకమ్మ వేడుకలు

#batukamma

ఖమ్మం కలెక్టరేట్ లో రెండోరోజు బతుకమ్మ వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ సంబరాల్లో సి విజిల్, ఎన్నికల సంఘం లోగో ముగ్గులు వేసి, స్వీప్ కార్యక్రమం ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగం పై నినాదాలు, ప్లే కార్డులు బతుకమ్మల వద్ద ప్రదర్శిస్తూ, ఓటు కు సంబంధించి పాటలు పాడుతూ కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు సి విజిల్ ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి డౌన్లోడ్ చేసుకోవాలని, యువత కు అవగాహన కల్పించి డౌన్లోడ్ చేయించాలని అన్నారు. దేశమంతా పండుగలా వస్తున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. డబ్బు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఓటు వేయాలన్నారు. డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టే సామాజిక బాధ్యతను ప్రతిఒక్కరు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.

Related posts

కాటేదాన్ పారిశ్రామిక వాడలో చిరుత పులి

Satyam NEWS

దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన MLA

Satyam NEWS

ఇందిరానగర్ పేదలను తరలిస్తే ఊరుకోం

Satyam NEWS

Leave a Comment