32.7 C
Hyderabad
April 27, 2024 01: 41 AM
Slider నిజామాబాద్

భగీరథ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

#Bhageeratha Employees

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మిషన్ భగీరథ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జిల్లాలో పని చేస్తున్న వర్క్ ఇన్స్ స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు 20 మందిని తొగించడాన్ని నిరసించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ను కలిసి తమ ఆవేదనను చెప్పికున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 709 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. గత నెల 27 న విసి మీటింగ్ లో తమని తొలగించారని, జులై 1 నుంచి విధులకు రావద్దని చెప్పారని తెలిపారు. గత నాలుగేళ్లుగా తాము మిషన్ భగీరథలో పని చేస్తున్నామన్నారు.

అసలే కరోనా సమయంలో తమను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమపై ఆధారపడి ఉన్న తమ కుటుంబాలు ఉద్యోగాలు తీసివేయడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమకు 5 నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించి తమకు ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వినోద్, రవీందర్, శ్రావణ్, శైలేష్, శ్రీను, విజయ్, హరీష్, సుధారాణి, స్వాతి, నీతూ గుప్త, నవీన, రజిత, మహేందర్, ప్రశాంత్, సురేష్, నవీన్, మహేష్ పాల్గొన్నారు

Related posts

31 నుండి ఫిబ్ర‌వ‌రి 2 వ‌ర‌కు తిరుమ‌ల‌లో పల్స్‌పోలియో

Satyam NEWS

చైతన్య అధినేత మృతి

Bhavani

హోరెత్తిస్తున్నసోష‌ల్ మీడియా

Sub Editor

Leave a Comment