40.2 C
Hyderabad
April 26, 2024 11: 52 AM
Slider ముఖ్యంశాలు

జోడో యాత్రలో భట్టి

#batti

దేశ సమైక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా నారాయణపేట జిల్లా, గుడబల్లేరు గ్రామంలోని కృష్ణానది బ్రిడ్జి పైన రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎదిరేగి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం  చెప్పారు. అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  గ్రామంలో కార్నర్ వద్ద ఏర్పాటుచేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడే క్రమంలో పాదయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి డీసీఎం పైకి ఎక్కి రాహుల్ తో పాటు అభివాదం చేశారు. భారత్ జోడో కల్చరల్ కమిటీ చైర్మన్ అయిన  మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొమ్ము కోయ, కోలాట నృత్యం, డప్పుల దరువు, ధూంధాం కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా భద్రాచలం గిరిజన సాంప్రదాయ నృత్యమైన కొమ్ము కోయ, కళాకారులు భారత్ జోడో యాత్రలో చేసిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కోలాట నృత్యం, డప్పుల దరువు, కళాకారుల ఆట_పాట మాటలు పాదయాత్రలో జోష్ ను పెంచాయి.

Related posts

మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

శ్రీ‌విష్ణు హీరోగా, ప్ర‌దీప్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ల‌క్కీ మీడియా ఫిల్మ్ ప్రారంభం

Satyam NEWS

కొత్త సంవత్సరంలో మాజీమంత్రి జూపల్లి కొత్త నిర్ణయం?

Satyam NEWS

Leave a Comment