28.7 C
Hyderabad
April 26, 2024 08: 47 AM
Slider శ్రీకాకుళం

వైభవంగా కాళీయమర్ధనుడికి క్షీరాభిషేకం

#BheeshmaEkadasi

మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) ని పురస్కరించుకొని కాళీయమర్ధన వేణుగోపాల స్వామి ( శాలిహుండాం ) యాత్ర మంగళవారం శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్వేతగిరిలో  శోభాయమానంగా జరిగింది.

ఉత్తరాంధ్రాతో పాటు ఒడిశా నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్వేతగిరి కిటకిటలాంది. సోమవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో స్వామికి అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయ వంశపారపర్య కమిటీ సభ్యులు కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ బృందం తొలి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఆలయ అర్చకులు మహేంద్రాడ సాయిశర్మ, మహేంద్రాడ రవిశర్మ తదితరులు క్షీరాభిషేకం నిర్వహించారు.

పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ ఘట్టాన్ని తిలకించారు. వేలాదిగా భక్తజనం స్వామివారి దర్శనానికి వచ్చి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి ముందు రోజు రాత్రికి చేరుకున్న భక్తులు బోరవాని పేట, శాలిహుండాం, పూసర్లపాడు, కొంక్యాన పేట, వేణుగోపాలపురం గ్రామాల్లో విడిది ఏర్పాటుచేసుకొని ప్రతాలు చేశారు. శ్వేతగిరిపై ఉన్న పంచక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.

తిరువీధి ఉత్సవాలతో యాత్ర ప్రారంభం

రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి యాత్ర మహోత్సవాలు భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవాలతో ప్రారంభమయ్యాయి. కొంక్యాన , కొన్న కుటుంబాల తరపున కోట సావిత్రమ్మ ప్రారంభించారు.

వైభవంగా చక్రతీర్థస్నానం యాత్రలో కీలకమైన స్వామి చక్రతీర్థస్నానం భక్తి శ్రద్ధలతో మంగళవారం ఉదయం నిర్వహించారు. స్వామి ఉత్సవ మూర్తులైన రుక్మిణి , సత్యభామ సమేత వేణుగోపాలుడితో పాటు క్ష్మీనరసింహ స్వామిని రోప్ పార్టీల సాయంతో రెండు పల్లల్లో సుమారు కిలోమీటర్ల దూరంలోని వంశధార నదికి తీసుకొచ్చారు.

ఉదయం నుంచి స్వామి రాక కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భక్తులు స్వామి స్నానంతో పాటు పవిత్ర స్నానాలు చేశారు. వంశధార నదిలో కిలోమీటరు పొడవునా పవిత్ర స్నానాలకు బారులు తీరారు. గార పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

శివతత్వం పుస్తకాలు పంపిణీ .. దేవుళ్లలో పరమశివునికి ఉన్న ప్రాముఖ్యతను వివరించే విధంగా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, శివపరమాత్మ ధ్యానయోగ మందిరం రూపొందించిన శివతత్వం పుస్తకాలను 20 వేల మంది భక్తులకు కమిటీ సభ్యులు అందజేశారు.

వీరికి కొంక్యాన కుటుంబ సభ్యులు రాధాకృష్ణ , మురళీధర్ , వేణుగోపాల్ , ఆదినారాయణ సహకరించారు. భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ .. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్వేతగిరిలో వేణుగోపాలస్వామిని దర్శించుకున్న సందర్భంగా బైలి జంక్షన్ , బూరవెల్లి , అంబళ్లవలస, పూసర్లపాడుతోట , శాలిహుండాం, బోరవాని పేట, కొంక్యాన పేట, వేణుగోపాలపురం గ్రామాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Related posts

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపికి ఎదురుదెబ్బ

Satyam NEWS

భార్యాభర్తల విభేదాలే హత్యకు కారణమా?

Bhavani

శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంలో రాష్ట్రావతరణ వేడుక

Satyam NEWS

Leave a Comment