26.7 C
Hyderabad
April 27, 2024 09: 15 AM
Slider వరంగల్

పోలీస్ ఎలర్ట్: బైక్ చోరీల అంతర్ జిల్లా ముఠా అరెస్ట్

janagam police

ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ లను రాత్రి సమయంలో దొంగలిస్తున్న నలుగురు చోరుల ముఠా సభ్యులను శనివారం జనగామ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.8 లక్షల విలువైన 6 ద్విచక్ర వాహనాలు, దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ స్వాధీనం చేసుకున్నారు.

జనగాం లోని లక్ష్మీబాయి కుంటకు చెందిన పానుగంటి కృష్ణ, ధర్మ కంచ కు చెందిన గూడెపు పృథ్వీరాజ్, నెహ్రూపార్క్ కు చెందిన మామిళ్ళపల్లి అరవింద్ లను  అరెస్టు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డిసిపి వెస్ట్ జోన్ తెలియజేస్తూ ఇందులో లో మామిళ్ళపల్లి అరవింద్ పాత నిందితుడని తెలిపారు. జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. జనగామ ఎస్ ఐ రాజేష్ తమ సిబ్బందితో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు నిందితులు పానుగంటి కృష్ణ, పృథ్వి రాజ్ అనుమానాస్పదంగా ఉండగా పట్టుకుని తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడిందని అన్నారు.

బండి పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరినీ బండి తో సహా అదుపులోకి తీసుకొని విచారించారని తెలిపారు. జల్సాలు చేయడానికి, సినిమాలు చూడడానికి, మందు తాగడానికి డబ్బులు లేక పోవడంతో వీరందరూ ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. వారిని ఆధీనంలోకి తీసుకుని వారి వద్ద సీజ్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాలను పంచుల సమక్షంలో లో వారి వారి ఇంటి ఆవరణలో స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం పై నలుగురిని జ్యూడిషల్ రిమాండ్ కు తరలిస్తున్నారు.

Related posts

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

Satyam NEWS

హనుమంత వాహనంపై సీతారామలక్ష్మణులు….

Satyam NEWS

ఉత్తర నక్షత్ర పూజ: స్వామి యే శరణం అయ్యప్ప

Satyam NEWS

Leave a Comment