38.2 C
Hyderabad
April 29, 2024 19: 04 PM
Slider చిత్తూరు

లోకేష్ ను కలిసి సమస్యలను వివరించిన బీమా మిత్రలు

#Lokesh

చిత్తూరు నియోజకవర్గం లోని బీమా మిత్రలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను వివరించారు. డిఆర్ డిఎ క్రాంతి పథకం కింద గత 13సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1200మంది బీమా సేవలు అందిస్తూ వచ్చాం. 2019లో ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం మమ్మల్ని తొలగించింది అని వారు వాపోయారు.

గతంలో చంద్రన్న బీమా పథకం విజయవంతంగా అమలుకావడానికి సేవలందించామని వారు వివరించారు. పేద కుటుంబంలో ఎవరు చనిపోయినా వెంటనే గుర్తించి ఆర్థికసాయం అందేలా చూశాం. టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీమా మిత్రలను కొనసాగించండి అని వారు కోరారు. లోకేష్ మాట్లాడుతూ రెక్కాడితేగానీ డొక్కాడని పేదలకు అండగా నిలచేందుకే గతంలో చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం.

వైసిపి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని రద్దుచేసి తీరని అన్యాయం చేసింది. డ్వాక్రా మహిళలకు చెందిన రూ.2,200 కోట్ల అభయహస్తం నిధులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ.700 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం స్వాహాచేసింది.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా, అభయహస్తం పథకాలను తిరిగి అమలుచేస్తాం. బీమా మిత్రల సేవలను వినియోగించుకొని నిరుపేదలు, మహిళలకు అండగా నిలుస్తాం. బీమా మిత్రల సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.

Related posts

పౌర విమానయానంలో నైపుణ్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏమిటి?

Satyam NEWS

రాబోవు నాలుగు రోజుల పాటు ఏపీలో అత్య‌ధిక ఉష్టో్గ్ర‌త‌లు..!

Satyam NEWS

కేజీబీవీ అధ్యాపకులను వాడుకుని వదిలేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment