26.7 C
Hyderabad
April 27, 2024 07: 59 AM
Slider ముఖ్యంశాలు

జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం

#GVLNarasimharao

అప్పులు చేసి పన్నులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం కేంద్రంపై అపవాదు వేస్తున్నదని బీజేపీ ఎంపీ జీవియల్ నరసింహరావు అన్నారు. రాష్ట్రంలో పన్నుల పెరుగుదలకు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎక్కడా పన్నుల పెంపుపై ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చెబితే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలికదా?  బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఆస్థి పన్నులు పెంచలేదని ఆయన స్పష్టం చేశారు.

అప్పులు తీర్చుకొనేందుకు పన్నులు పెంచి కేంద్రంపై నింద మోపుతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలన్నింటికీ వారి స్టికర్లు వేసుకొని, పన్నుల నిర్ణయాన్ని కేంద్రానికి ఆపాదిస్తారా? ఎంత మోసం? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం” అని పేరు పెట్టుకోని పన్నులు పెంచుకోండని ఆయన అన్నారు. పియమ్ఏవై కిందా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే జగనన్న కాలనీలు అని మీ పేరు పెట్టుకొని  ప్రచారం చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంచుతూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని జీవిఎల్ డిమాండ్ చేశారు.

Related posts

నాటి ప్రకాశం గారి పార్క్…నేడు మహిళా పార్క్…కానీ…!

Bhavani

సెలవు రోజున వ్యవసాయ పనులు చేసిన తస్లీమా

Satyam NEWS

వనపర్తికి వన్నె తెచ్చిన బిసి నేతలకు తీరని అవమానం

Satyam NEWS

Leave a Comment