30.7 C
Hyderabad
April 29, 2024 04: 43 AM
Slider హైదరాబాద్

31వ రోజుకు చేరిన గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర

#ravichandrayadav

మంగళవారంతో గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర 31 వ రోజుకు చేరిందని రవి కుమార్ యాదవ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా కూకట్పల్లి డివిజన్అస్బెస్ట్ కాలనీలోని అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నుండి పాదయాత్ర ప్రారంభమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బి .ఆర్. ఎస్ పాలనలో ప్రజలు విసుకు చెందారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులను ఇంటికి పంపాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వ పథకాలను ,రేషన్ కార్డులు, పింఛన్స్ ,ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయని, ఎటు చూసినా మురికివాడలు, రోడ్లు సరిగా లేకపోవడం, ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య ధోరణి వదిలి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ప్రజలలో చైతన్యం రావాలని యువత ముందుకు రావాలని, స్వార్థపూరిత రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని, ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంగా భారతీయ జనతా పార్టీ ముందుకు కొనసాగుతున్నదని రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరనున్నదని, గడపగడపకు బిజెపి కార్యక్రమంలో ప్రజల ఆదరణలు పొందుతూ, ముందుకు సాగుతున్న బిజెపి తెలంగాణ గడ్డమీద విజయ శంకనాదం పూరించనున్నామని ఆయన అన్నారు.

ప్రతి చోటా ఘనస్వాగతం పలుకుతున్నారని, ప్రజలే నా బలం ప్రజలే నాబలగం అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, శ్రీహరి యాదవ్ సీనియర్ నాయకులు వెంకటేష్, నరేష్, రఘునాథ్, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ పటేల్ ,బాలు యాదవ్, విజయ్ కుమార్, శ్రీనివాస్ పటేల్ ,సిద్దయ్య, రమేష్ యాదవ్, గోవర్ధన చారి, ప్రభాకర్, నర్సింగ్ రావు, శ్రీలత, అరుణ, లక్ష్మమ్మ, మణెమ్మ, రేణుక ,కల్పనా, సైదమ్మ ,నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు రూ.150 కోట్లు

Satyam NEWS

శివోహం: వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు

Satyam NEWS

నెల్లూరు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి అనిల్

Satyam NEWS

Leave a Comment