26.2 C
Hyderabad
December 11, 2024 18: 09 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

హమ్మ పచ్చ తమ్ముళ్లూ ఇంతకు తెగిస్తారా?

ap secratariat

ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో అడుగడుగునా తిష్టవేసుకుని ఉన్న చంద్రబాబునాయుడి మనుషులు వై ఎస్ జగన్ పాలనకు అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఏ ఏ శాఖలో ఎక్కడెక్కడ చంద్రబాబునాయుడి మనుషులు ఉన్నారో పసిగట్టడంలో జగన్ ప్రభుత్వం చురుకుగా వ్యవహరించకపోవడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై జీవోలు కూడా విడుదల కాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సాధారణ పరిపాలనా శాఖ సంబంధిత శాఖలకు తెలియచేస్తుంది. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా వారు చర్యలు తీసుకుని వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. 16వ తేదీన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నాలుగు జీవోలు ఇవ్వాల్సి వచ్చింది. అదే విషయాన్ని సాధారణ పరిపాలన శాఖ సంబంధిత శాఖలకు తెలియపరిచింది. మూడు జీవోలు విడుదల అయ్యాయి. ఒక్క జీవో మాత్రం విడుదల కాలేదు.

ఈ విషయం మరి కొంత కాలం పాటు బయటకు వచ్చేది కాదు కానీ ఎందుకో ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత జీవో వచ్చిందా అని అడిగే సరికి సాధారణ పరిపాలనా శాఖ తెల్ల మొహం వేసింది. విషయం ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సలహాదారుల వరకూ వెళ్లింది. దాంతో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను పిలిచి అడిగారు. ఆయన సంబంధిత రెవెన్యూ శాఖ వారిని పిలిచి అడిగారు. జీవో విడుదల కాలేదని తేలింది.

సాధారణంగా మంత్రి వర్గ సమావేశం జరిగిన 48 గంటల్లో ఏవైనా జీవోలు విడుదల కావాలంటే అయిపోతాయి. అసాధారణ పరిస్థితుల్లో మరో రెండు రోజులు గడువు ఉంటుంది. అయితే 16వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరిగితే 24వ తేదీ వరకూ జీవో విడుదల కాకపోవడం తీవ్రమైన చర్య. ఇంతగా తొక్కి పెట్టిన ఆ విషయం ఏమిటంటే విశాఖ పట్నం నడిబొడ్డున గల పరదేశి  పాలెం లో ఆమోద పబ్లికేషన్స్ కి గత ప్రభుత్వం అతి చౌకగా కట్టబెట్టిన 1.5 ఎకరాల భూ కేటాయింపు రద్దు విషయం.

ఈ భూమిని బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు కోసం వాడాలని మంత్రి వర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ కొత్త జీవోను విడుదల చేయాల్సిన రెవెన్యూ శాఖ దాన్ని తొక్కిపెట్టింది. దాంతో ఒక్క సారిగా ప్రభుత్వం ఉలిక్కి పడింది. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయకుండా తొక్కి పట్టిన వారిని పిలిచి ముఖ్యమంత్రి సలహాదారుడు అజేయ కల్లాం తీవ్రంగా మందలించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఈ భూమిని తిరిగి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు పచ్చ తమ్ముళ్లు. అదీ సంగతి.

Related posts

వడగళ్ల వానతో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన స్పీకర్

Satyam NEWS

రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కల్వకుర్తి రోడ్లు

Satyam NEWS

ఏసీబీ వలలో చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్

Satyam NEWS

Leave a Comment