30.7 C
Hyderabad
April 29, 2024 05: 40 AM
Slider వరంగల్

గిరిజన తండాల్లో లయన్స్ క్లబ్ బ్లాంకెట్ల పంపిణీ

#lionsclub

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినిపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ బ్లాంకెట్ల పంపిణీ చేసింది. చింతలమోరే, రాయబందం, లింగాపురం, సండ్రగూడెం, గుర్రాలబావి, కొమురంభీం నగర్ గుత్తికోయల గుంపులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వివేకానందపురం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు లయన్స్ జిల్లాల గవర్నర్లు లయన్ కమల్ కిషోర్ అగర్వాల్ (జిల్లా 320B), లయన్ కన్నా పరుశురాములు (జిల్లా 320F) ముఖ్య అతిధులుగా విచ్చేశారు. లయన్స్ మాజీ గవర్నర్ లయన్ దీపక్ భట్టాచార్జీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లయన్ పింగళి నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఏటూరునాగారం ASP సుధీర్ కుమార్ కి, CI రాజు కి మీడియా ముఖంగా తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో ములుగు క్లబ్ అధ్యక్షుడు చుంచు రమేష్, వివేకానందపురం క్లబ్ అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్ సికింద్రాబాద్ మరియు వరంగల్ జిల్లాలకు చెందిన లయన్స్ పదాధికారులు, లయన్స్ మహిళా సభ్యులు  ఉత్సాహంగా పాల్గొని మారుమూల అటవీ ప్రాంతంలో ఏ సౌకర్యాలు లేని ఆదివాసీలకు తమ వంతుగా చేయూతనివ్వడం ఎంతో సంతృప్తికరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం కొమురం భీమ్ నగర్ లో వివేకానందపురం క్లబ్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా నడుస్తున్న లయన్స్ ఆదివాసీ విద్యాకేంద్రంని సందర్శించి తమ చిన్నారులకు దుస్తులు, ఆడవారికి చీరలు అందజేశారు.

Related posts

సుస్థిర అభివృద్ధి సాధనకు మనసు పెట్టి పని చేయాలి…!

Satyam NEWS

హే డ్రంకర్స్:తాగి నడిపి రూ.2.25 కోట్లు ఫైన్ కట్టారు

Satyam NEWS

రెవెన్యూ అధికారులు నిద్రలో.. అక్రమార్కుల సంపాదన కోట్లల్లో

Bhavani

Leave a Comment