28.7 C
Hyderabad
April 27, 2024 04: 34 AM
Slider అనంతపురం

ఏసీబీ వలలో బుక్కరాయసముద్రం సిఐ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సర్కిల్ సీఐ రాము, కానిస్టేబుల్ కరీం ఒక భూ వివాదం పరిష్కారం కోసం బాధితుల నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాత్రి నుంచి వారిద్దరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి విచారిస్తున్నారు. సిఐ రాము ఆది నుంచి వివాదాస్పదంగా ఉన్నారు. గుత్తి సిఐగా పనిచేస్తున్న సమయంలో అక్కడ ఆర్థిక లావాదేవీల విషయంపై సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.

సిఐ అవినీతిపై ఏకంగా డి.ఎస్.పి కి లిఖితపూర్వకంగా ఎస్సై సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనంగా మారింది. బుక్కరాయసముద్రం సీఐ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అవినీతి ఆరోపణలు వారి మీద వచ్చాయి. ఎడ్ల బండి పై ఇసుక తీసుకెళ్లే రైతుల నుంచి మామూలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. చాలాకాలంగా సిఐ రాము వ్యవహారంపై నిఘా వేసిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు వల పని అరెస్ట్ చేశారు.

Related posts

విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం

Satyam NEWS

సి.సి. రోడ్లకు నిధులు మంజూరు చేయాలి

Sub Editor

Good News: క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Satyam NEWS

Leave a Comment