42.2 C
Hyderabad
April 26, 2024 18: 18 PM
Slider గుంటూరు

బులియన్ మర్చంట్స్ బంద్ ను జయప్రదం చేయండి

#bullionmarket

దేశవ్యాప్తంగా బులియన్ మర్చంట్స్ పిలుపు మేరకు సోమవారం తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వస్తువును బిస్ హాల్ మార్కు కు అప్లోడ్ చేయాలని నిబంధనలు ఉన్నాయని అక్కడ డౌన్ లోడ్ అయిన తర్వాత వ్యాపారస్తులకు హాల్మార్క్ వేస్తున్నారని ఇది ఇబ్బందికరమైన పరిస్థితే అన్నారు.

దేశవ్యాప్తంగా 841 జిల్లాలు ఉన్నాయని, అందులో 256 జిల్లాలలో మాత్రమే హాల్మార్క్ సెంటర్స్ ఉన్నాయన్నారు. హాల్ మార్క్ ను వ్యాపారస్తులు అందరూ స్వాగతిస్తున్నారని, హెచ్ యు ఐ డి ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు హాల్మార్క్ ఆభరణాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా వెండి ఆభరణాలకు హాల్మార్క్ తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టిందని దీనికి కూడా వ్యాపారస్తులు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బులియన్ మర్చంట్స్ పట్టణం ప్రధాన కార్యదర్శి కాపులపల్లి ఆదిరెడ్డి ,జాయింట్ సెక్రెటరీ కొత్తమాసు పేరయ్య, కోశాధికారి డేసు రజిని కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

[Over-The-Counter] Triceratops Male Enhancement Best Pills For Erectile Dysfunction Height Xl Pills Review

Bhavani

తిరుపతిలో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతం

Satyam NEWS

టీఆర్ఎస్ కీలక భేటీలో.. ఏంఐఎం అధినేత

Sub Editor

Leave a Comment