Slider ముఖ్యంశాలు

డాక్టర్ సుధాకర్ సంఘటనపై సీబీఐ విచారణ

#Dr.Sudhakar

నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పట్నం పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటనపై రాష్ట్ర హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనకు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం సంఘటనపై 8 వారాలలో గా నివేదిక ఇవ్వాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నర్సీపట్నం ఆసుపత్రిలో ఎనస్తటిస్టుగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ కరోనా నుంచి వైద్య సిబ్బందిని కాపాడుకోవడానికి పిపిఈ కిట్లు, మాస్కులు లేవని బహిరంగంగా తెలిపిన విషయం తెలిసిందే.

దీనికి ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. డాక్టర్ సుధాకర్ ఆ తర్వాత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన తాగి రోడ్డుపైకి వచ్చారని ఆయన అందరిని దుర్భాషలాడుతున్నారని చెబుతూ విశాఖపట్నం పోలీసులు ఆయన బట్టలు విప్పించి, చేతులు వెనక్కి కట్టి కొట్టారు.

 అంతేకాదు ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో… ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్ అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు.

మరోవైపు, డాక్టర్ సుధాకర్ ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.

Related posts

40 లక్షల విలువైన 236 సెల్ ఫోన్లు అప్పగింత

Satyam NEWS

బాబాయి మర్డర్: సీబీఐ అదుపులో ఎర్రం గంగిరెడ్డి

Satyam NEWS

దివ్యంగులకు ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Satyam NEWS

Leave a Comment