29.7 C
Hyderabad
April 29, 2024 10: 24 AM
Slider విజయనగరం

అమిత్ షా ఫోన్ తో ఆలోచన మార్చుకున్న జగన్ ప్రభుత్వం

#RamateerdhamCID

రామ‌తీర్ధం  నీలాచ‌లం కొండ‌పై జ‌రిగిన ఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఘ‌టన జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం నుంచీ మంత్రులు, అధికార పార్టీ నుంచీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ‌చ్చి ప‌రిశీలించడం…రామ‌తీర్ధం దేవస్థానానికి కొత్త క‌మీష‌న‌ర్ నియ‌మించ‌డం ద్వారా జ‌రిగింది.

మ‌రోవైపు నెల్లి మ‌ర్ల పోలీసులు కేసు క‌ట్టినా…జిల్లా ఎస్పీ ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి నిశితంగా ప‌రిశీలించ‌డం…దాంతో పాటు టెక్నిక‌ల్ ఆధారాలు సేకరించే పనిలో స్వ‌యంగా ఎస్పీ నే పాల్గొంటున్నారు కూడ‌. అయితే రామ‌తీర్ధం నీలాచలం కొండ ను సంద‌ర్శించాల‌ని బీజేపీ భావించిన ద‌ర‌మిలా..ఆఘ‌మేఘాల మీద జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై…సీఐడీ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.

స‌రిగ్గా బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు సోమువీర్రాజు,ఎమ్మెల్సీ మాధ‌వ్ లు రామ‌తీర్ధం నీలాచ‌లం కొండ‌ను త‌ద్వారా రాముని దేవాల‌యాన్ని సంద‌ర్శించేందుకు వెళ్లే క్ర‌మంలో భారీ పోలీసు బందోబ‌స్తుతో నెల్లిమ‌ర్ల‌లోనే ఆ నేత‌ల‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేసారు.

బీజేపీ నేత‌లు అరెస్ట్ అంశం కాస్తా రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ వెంట‌నే కేంద్రం కూడా స్పందించింది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…స్వ‌యంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడుకి ఫోన్ చేసి వివ‌రాలు క‌నుక్కున్నారు. ప‌రిస్థితి కేంద్రం వ‌ర‌కు వెళ్ల‌డంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం…తక్షణం  సీఐడీ అడిష‌న‌ల్ డీజీపీ ని రంగంలోకి దించింది.

దీంతో ఆయ‌న రామ‌తీర్దం నీలాచ‌లం కొండ ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఆయ‌న‌తో పాటు డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ రాజ‌కుమారీలు కూడా ఉన్నారు. ఏదైనా నీలాచలం కొండ పై జ‌రిగిన విగ్ర‌హ ఖండ‌న అంశం….కేంద్రానికి పాకింద‌నే చెప్పాలి.

Related posts

ఏపి గవర్నర్ కు త్వరలో స్థాన చలనం తప్పదా?

Satyam NEWS

రాజంపేట లో ఆ రెండు సామాజిక వర్గాల దే ఆధిపత్యం.!

Satyam NEWS

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకుందాం

Satyam NEWS

Leave a Comment