రియల్ ఎస్టేట్ ఏజెంటులా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతల కు రియల్ వ్యాపారం ఉంది కనుకే వారంతా తన మాటలకు భయపడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనేది తమ ప్రభుత్వ విధానమని, తద్వారా 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నామని ఆయన తెలిపారు.
రాజధానిపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని మంత్రి అన్నారు. శివరామకృష్ణన్ రిపోర్టు ని పరిగణలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణానదికి వరదలు వస్తే ఈ ప్రాంతం మునిగిపోతుందని శివరామకృష్ణన్ కమిటీలో చెప్పారని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కుకు నీరు వస్తే ఆ ప్రాంతం అతలాకుతలం అయింది. మొన్న 8 లక్షలు వచ్చాయి. అందుకే అంత వరకూ నీళ్లు వచ్చాయి అని మంత్రి బొత్స అన్నారు.