34.2 C
Hyderabad
April 23, 2024 13: 32 PM
Slider తెలంగాణ

గణేష్ ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు

Talasani_Srinivas_Yadav

హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఆయన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు మహమూద్ అలీ, శ మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ శాఖల అధికారులుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో 54 వేల వినాయక ప్రతిమలను ప్రతి ఏటా ఏర్పాటు చేస్తారని అందువల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నిప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు. గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని అందువల్ల భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరపున హుసేన్ సాగర్ లో  గంగ హారతి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అయితే హారతి ఎప్పుడు ఇవ్వాలనే  అనేదానిపై పురోహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 26 చోట్ల నిమజ్జనం కోసం లేక్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం నాడు ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు పనులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి చాలా బాగా ఏర్పాట్లు చేస్తోందని యన కొనియాడారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని శాఖలతో వినాయక చవితి పై సమావేశం నిర్వహించాం. అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్నాం. హైదరాబాద్ అనేది సర్వ మతాలను గౌరవించే నగరం అని అన్నారు.

Related posts

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS

సహకార సర్వీస్ సంఘానికి అధ్యక్షుడుగా టాండన్

Bhavani

సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఇక్షు’ మూవీ రిలీజ్

Satyam NEWS

Leave a Comment