23.2 C
Hyderabad
September 27, 2023 19: 53 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చంద్రబాబునాయుడి మళ్లీ యూ టర్న్

cbn u turn

అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా జీవో జారీ చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కోడెల శివప్రసాదరావు పై వచ్చిన అభియోగాలపై సిబిఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. చంద్రబాబునాయుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అసెంబ్లీ ఫర్నీచర్ అమరావతికి వచ్చే సందర్భంలో తన ఇంటికి, తన కొడుకు హీరో షోరూం కు కోడెల పంపించారన్న కేసును అతి తక్కువ చేసి చంద్రబాబునాయుడు ఎలా మాట్లాడతారని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను కోడెల తీసుకువెళ్లారని చంద్రబాబునాయుడు తెలిసో తెలియకో అంగీకరిస్తున్నారని ఆయన మాటల బట్టి అర్ధం అవుతున్నది. కోడెల తీసుకువెళ్లిన ఫర్నీచర్ కేవలం లక్ష రూపాయల ఖరీదైనదే అని చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నారు. అంటే కోడెల ఫర్నీచర్ ను తీసుకువెళ్లినట్లు అధికారికంగా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు అవుతున్నది. కోటి రూపాయలు చోరీ చేసినా వెయ్యి రూపాయలు చోరీ చేసినా దాన్ని దొంగతనం అనే అంటారనే చిన్న లాజిక్ ను చంద్రబాబునాయుడు మర్చిపోతున్నారని కూడా అంటున్నారు. కోడెల జీవించి ఉండగా ఆయనను చంద్రబాబునాయుడు నిరాదరణకు గురిచేశారని వైసిపి నాయకులు చెబుతున్న మాటలపై ప్రజలు ఆలోచిస్తున్నారు. కోడెల విషయంలో చంద్రబాబునాయుడు యూటర్న్ తీసుకున్నారని కూడా అంటున్నారు.

Related posts

కొల్లాపూర్ లో బద్మాష్ రాజకీయాలు చేస్తున్నారు

Satyam NEWS

శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ 28వ జన్మదినోత్సవ నాడు వేద సప్తాహం

Satyam NEWS

మహావీర్ ఇంజనీరింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!