42.2 C
Hyderabad
April 26, 2024 16: 28 PM
Slider ప్రత్యేకం

కోవిడ్ 19 రోగులలో ముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్)కు హోమియో చికిత్స

#Dr.Durgarao

మెదడు, ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ముకోర్మైకోసిస్ అనే బ్లాక్ ఫంగస్ బారిన పడిన కోవిడ్ -19 రోగుల సంఖ్య భారతదేశమంతా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాపేక్షంగా పెరుగుతుంది. ముకోర్మైకోసిస్ అనేది కొన్ని కోవిడ్ -19 రోగులలో అనియంత్రిత మధుమేహం మరియు దీర్ఘకాలిక ఇంటెన్సివ్ కేర్ (ఐసియు) చికిత్స అనంతరం కనిపించే ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్.  ‘బ్లాక్ ఫంగస్’ అని కూడా పిలువబడే ఇన్ఫెక్షన్ మెదడు మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.

బ్లాక్ ఫంగస్ కేసులు తెలంగాణా లో కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది అరుదైనది కానీ ప్రమాదకరమైనది కూడా.

నివారణ, లక్షణాలు, చికిత్స

కళ్ళు, ముక్కు చుట్టూ నొప్పి, ఎరుపు, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సమస్య, రక్తపాత వాంతులు, మానసిక స్థితిగతులల్లో మార్పు ప్రధాన హెచ్చరికలు. 

కోవిడ్ -19 రోగులలో డయాబెటిస్, రోగనిరోధక శక్తి బలహీనమైన వ్యక్తులలో ముకోర్మైకోసిస్ ఉంటే తప్పక అనుమానించాలి.

సైనసిటిస్, నాసికలో అడ్డుపడినట్లుగా ఉండటం

ముఖంలో ఒకవైపు నొప్పి లేదా తిమ్మిరి , ముక్కు లేదా అంగిలి యొక్క వంతెనపై నల్లని రంగు ,

పంటి నొప్పి , దృష్టిలో తేడా లేదా డబుల్ విజన్ ,  చర్మంపై గాయం

ఛాతీ నొప్పి మరియు శ్వాసకోశ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు నిర్ధారణ చేసుకోవాలి.

ముకోర్మైకోసిస్ యాంటీ ఫంగల్ మందులతో చికిత్స చేస్తారు కాని చివరికి కొన్ని కేసులు శస్త్రచికిత్స అవసరం ఉంటుంది. డయాబెటిస్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం, స్టెరాయిడ్ వాడకాన్ని తగ్గించి మరియు ఇమ్యునోసప్రెసెంట్ మందులను నిలిపివేయాలి.

దీన్ని ఎలా నివారించాలి ?

వ్యాధిని నివారించడానికి కోవిడ్ అనంతరం డయాబెటిక్ రోగులలో కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పర్యవేక్షించాలి. అవసరం ఉన్న రోగుల్లో మాత్రమే స్టెరాయిడ్లను మితంగా ఉపయోగించాలి.  ఆక్సిజన్ చికిత్స సమయంలో  శుభ్రమైన నీటిని వాడాలి. యాంటీబయాటిక్స్ , యాంటీ ఫంగల్ , ఇతర సప్లిమెంట్   మందులను సరిగ్గా వాడాలి.

మూకార్మైకాసిస్ – హోమియోపతి

మూకార్ మైకాసిస్ నివారణ , చికిత్సలకు హోమియోపతిలో గొప్ప అవకాశం ఉంది .ఏమాత్రం కొద్దిపాటి లక్షణాలు గమనించినా వెంటనే చికిత్స ప్రారంభించినట్లయితే సత్ఫలితాలను పొందవచ్చు. హోమియోపతి వైద్యంలో రోగి యొక్క వ్యక్తిగత లక్షణాలే కాకుండా  

వ్యాధి సంక్రమించే ఇటియోలజీ ,  పాథాలజీ ఆధారంగా ఔషధాలను ఎంపిక చేసి మెరుగైన చికిత్స అందించవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా రోగిని ప్రాణాపాయ పరిస్థితి నుండి రక్షించవచ్చు. పోస్ట్ కోవిడ్ కేర్ లో భాగంగా ఏ లక్షణాలు లేకపోయినా ముందస్తుగా ప్రివెంటివ్ హోమియో మెడిసిన్ వాడుకునే అవకాశం ఉంది. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించి భయాందోళనలను తొలగించాలి. ఇందుకుగాను హోమియో వైద్య ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రసార మాధ్యమాలు , ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం చెయ్యాలి. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటే

సకాలంలో ఎక్కువ మందికి హోమియోపతి మందుల ద్వారా చికిత్స అందించవచ్చు.

హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహిస్తున్న డా. సి. ఎల్.మోడీ చారిటబుల్ క్లినిక్స్ & స్పెషాలిటీలల్లో నిష్ణాతులైన హోమియో వైద్యులు దశాబ్దాలుగా నిత్యం ఉచిత సేవలు అందిస్తున్నారు. గత సంవత్సర కాలంగా కోవిడ్ మహమ్మారిని నియంత్రించటానికి ప్రత్యేక ఫీవర్ క్లినిక్ నిర్వహిస్తున్నాము.

కోవిడ్ అనంతరం ఉద్భవిస్తున్న ఈ బ్లాక్ ఫంగస్ ను నిర్మూలించడానికి ఆయుష్ వైద్య విధానాల వినియోగతకు అవకాశం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకున్న నేపథ్యంలో మా అసోసియేషన్ కూడా ప్రభుత్వ విధి విధానాలకు లోబడి బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ రోగులకు హోమియో చికిత్స అందించడానికి ముందుకు రావాలనే మా ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం !

సర్వే జనాః సుఖినోభవంతు !

డా. గోపాలకృష్ణ K ప్రెసిడెంట్, (హెచ్.యం.ఏ.టి) సెల్ నెం: 9849667077

డా. జి. దుర్గాప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి,(హెచ్.యమ్.ఏ.టి) సెల్ నెం:9849182691

హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, హిమయత్ నగర్, హైదరాబాద్ ( తెలంగాణ), డా. సి.ఎల్.మోడీ చారిటబుల్ క్లినిక్స్ & స్పెషాలిటీస్.

Related posts

సిబిఐటి కళాశాల లో ఘనం గా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Satyam NEWS

పల్స్ పోలియో ను విజయవంతం చేయండి

Satyam NEWS

మక్తల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు రుసుము అందజేత

Satyam NEWS

Leave a Comment