18.3 C
Hyderabad
December 6, 2022 05: 15 AM
Slider వరంగల్

బాలలు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ములుగు జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధ్వర్యంలో నేడు ములుగు KGBV లో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, సభ్యులు డాక్టర్ ఆకులపెల్లి మధు, షాహేదా బేగం హాజరయ్యారు. బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ కోసం నిర్దేశించిన చట్టం పైనా బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 పైనా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా బా వసుధ మాట్లాడుతూ బాలలు శారీరక ఎదుగుదలను అర్ధం చేసుకొని, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని, జీవితం లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి జీవన నైపుణ్యాలు అలవర్చు కోవాలని కోరారు. బాలలు తమ హక్కులకు భంగం వాటిల్లితే 1098 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. వివాహ వయసు రాకముందే బాల్య వివాహం చేసినట్లయితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాలల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ ఆకులపెల్లి మధు మాట్లాడుతూ బాలికలంతా తమ హక్కులపై అవగాహన కలిగి ఉండి పోటీతత్వం తో జీవితం లో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఎదగాలని అన్నారు. పిల్లల పై లైంగిక నేరాలు, బాల్య వివాహాలు వంటి సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. నేడు సమాజం లో బాల బాలికలపై లైంగిక దాడులు అధికమవడం చాలా బాధాకరమని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా వారిని ఈ కార్యక్రమం ద్వారా అవగాహనపర్చి తమను తాము కాపాడుకొనేలా, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందేలా జిల్లాలోని బాలల బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజిసిబి స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ, సోషల్ వర్కర్ బండారి జ్యోతి విద్యార్థినిలు పాల్గొన్నారు.

Related posts

రాప్తాడులో పెరిగిపోతున్న రాజకీయ వేడి

Satyam NEWS

నర్సులకు మాస్కులు అందించిన నర్సింగ్ అసోసియేషన్

Satyam NEWS

గ్రూప్- 1 మెయిన్స్ కు పక్కాగా ఏర్పాట్లు..ఎంత మంది హాజరవుతున్నారంటే…?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!