40.2 C
Hyderabad
April 26, 2024 13: 06 PM
Slider ప్రకాశం

కరోనా రోగుల్ని డబ్బుల కోసం పీక్కుతింటున్న చీరాల ఆసుపత్రి

#ChiralaHospital

ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ పరీక్షల్లోనూ కోవిడ్ రోగులను పీక్కుతింటున్న వైనం వెలుగుచూసింది. పైసలు ఇస్తేనే బెడ్లు, ప్రాణవాయువు సమకూరుస్తాం అన్నట్లుగా ఉంది చీరాల ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి. బచ్చు రాజశేఖర్ అనే కోవిడ్ బాధితుని వద్ద ప్రయివేటు లాబ్ నుండి వచ్చిన ఒకరు పదిహేను వందల రూపాయలు తీసుకుని రాపిడ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో పాజిటివ్ వచ్చినా ప్రభుత్వ వైద్యులు నెగటివ్ వచ్చిందని వైద్యశాల నుండి డిశ్చార్జ్ చేయడం గమనార్హం. పాజిటివ్ వచ్చిందో నెగటివ్ వచ్చిందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు వైద్యులు, సిబ్బంది. ప్రభుత్వ వైద్యశాలలో రాపిడ్ టెస్ట్ లు లేవని బయట నుండి లాబ్ అసిస్టెంట్ ని పిలిచి పరీక్షలు చేయమని డాక్టర్ విజయ్ కుమార్ పురమాయించడం గమనార్హమైన అంశం. ఇదే చీరాల ప్రభుత్వ వైద్యశాలలో మరొక కోవిడ్ బాధితుడు కూడా ఫోన్ పే ద్వారా బయట లాబ్ వారికి పదిహేను వందలు పే చేయడం గమనించాలి. ఈ విషయంపై వైద్యశాల ముఖ్య సంచాలకులు అయిన శేషు కుమార్ ని వివరణ కోరగా ఆయన బచ్చు రాజశేఖర్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. నా దృష్టికి వచ్చినందున తక్షణమే తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Related posts

Un Lock 3.0: సినిమా ధియేటర్లకు పర్మిషన్ నో

Satyam NEWS

నవంబరు 5 నుండి 7 వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS

లూజ్ టంగ్: ఇతనా ప్రజాప్రతినిధి? ఇదేం సంస్కృతి?

Satyam NEWS

Leave a Comment