సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్…. ఈ పేరు ఇప్పుడు మారుమోగి పోతున్నది. దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు దిశను అతి కిరాతకంగా హత్య చేసిన ప్రదేశంలోనే ఎన్ కౌంటర్ చేయడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ది రియల్ హీర్ సజ్జనార్ అంటే సామాజిక మాధ్యమాలలో ఆయన ఫొటోలు పెట్టి కామెంట్లు చేస్తున్నారు. వరంగల్ సీన్ చటాన్ పల్లిలో రిపీట్ చేసిన సజ్జనార్ కు జనం జేజేలు పలుకుతున్నారు. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వపణిక, ప్రణీతపై యాసిడ్ దాడికి ముగ్గురు నిందితులు పాల్పడ్డారు.
3రోజుల అనంతరం ముగ్గురు నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అప్పటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఉండేవారు. వరంగల్ ఎస్ పిగా విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ ఉండేవారు.
అదే ఎన్ కౌంటర్ విషయాన్ని దేశ ప్రజలు అందరూ ఇప్పటికీ గుర్తు పెట్టుకునారు. సరిగ్గా 10ఏళ్ల తరువాత సేమ్ ఇన్సిడెంట్ రిపీట్….అప్పుడు, ఇప్పుడు ఒకటే నెల డిసెంబర్ కావడం గమనార్హం. ఒకే అధికారి పోలీస్ బాస్ గా ఉండటం మరింత గుర్తు పెట్టుకోదగిన విషయం.
అందుకే తెలంగాణ రియల్ హీరో మీరే సార్ సెల్యూట్ సార్.. ఈ రోజు ప్రపంచం గర్వపడేలా ఒక మంచి పని చేసారు సార్ అంటూ సోషల్ మీడియాలో ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు.