39.2 C
Hyderabad
April 28, 2024 11: 57 AM
Slider ప్రత్యేకం

అయ్యయ్యో బ్రహ్మయ్య… సీఐకి ఎంత అన్యాయం చేశావయ్యా

#vinukondapolicestation

రాష్ట్రంలో వైసీపీ నాయకులకు ఏమైందో ఏమో కానీ సొంత కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అలాంటి ఇలాంటి కేసులు కాదు ఏకంగా హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. ఇదేదో ఎవరో చేసిన ఆరోపణ కాదు. సాక్ష్యాత్తూ పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలిని వ్యవహారం. ఎమ్మెల్యే మాట విని తప్పుడు కేసు పెట్టిన సీఐ పై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది.

ఎమ్మెల్యే చెప్పినట్టల్లా చేసి ఉద్యోగం పోగొట్టుకున్నానే అని ఇప్పుడు ఆ సీఐ వాపోతున్నాడు. ఈ విషయం అంతా గుంటూరు జిల్లా లో జరిగింది. నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరుకు ఒక దశదిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.

ఎంపి తమ వూరికి వచ్చాడని తెలుసుకున్న ఈపూరు నరేంద్ర అనే ఒక రైతు అక్కడకు వెళ్లాడు. ఈపూరు నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కీలక నాయకుడు.  తమకు ధాన్యం అమ్మిన డబ్బులు రాలేదని, ఎంతో ఇబ్బంది పడుతున్నామని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలుతో మొరపెట్టుకున్నాడు.

దాంతో ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్య చెప్పారు. జాయింట్ కలెక్టర్ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇంతటితో కథ అయిపోలేదు. వేల్పూరు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి సొంత ఊరు.

తన సొంత ఊరిలో తనను కాదని ఎంపికి సమస్య చెబుతాడా అని అనుకున్నాడో ఏమో కానీ నరేంద్ర ను ఎమ్మెల్యే చెప్పుతో కొట్టాడు. అలా తన సొంత పార్టీ నాయకుడిని కొట్టడమే కాకుండా తన పిఏతో ఫిర్యాదు చేయించి ఆ ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులపై వత్తిడి తీసుకువచ్చి నరేంద్ర పై హత్యాయత్నం కేసు పెట్టించాడు.

ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎదుటే ఈ వ్యవహారం అంతా జరగడంతో ఆయన ఒక్క సారిగా అవాక్కయ్యారు. పోలీసులు ఇంత అన్యాయంగా కేసు ఎలా పెడతారని ఎంపి ఆవేదన చెందారు. ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన నిజా నిజాలు చూడరా అని ఆయన ఎంతో ఆవేదన చెంది గుంటూరు జిల్లా ఎస్ పి కి లేఖ రాశారు.

అయితే ఎస్ పి పట్టించుకోలేదు. దాంతో రేంజ్ ఐజికి లేఖ రాశారు. ఆయన కూడా ఎంపి ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు డిజిపికి లేఖ రాశారు. లేఖ అందుకున్న డిజిపి ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా పోలీసులు అధికారులను ఆదేశించారు.

పోలీసు అధికారి ఒకరు విచారణ జరపగా నరేంద్ర పై హత్యాయత్నం కేసు పెట్టించింది ఎమ్మెల్యే అని తేలింది. అక్కడ జరిగిన సంఘటన వేరు, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వినుకొండ రూరల్ సీఐ చేసింది వేరు అని నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే మాట విని తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సిఐ అశోక్ కుమార్ ను ఆయన సస్పెండ్ చేశారు.

ఎమ్మెల్యే ల మాట విని తప్పుడు కేసులు పెట్టడం పోలీసులకు పరిపాటిగా మారింది. ఇలా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. పోలీసులూ ఇప్పటికైనా మారతారా?

Related posts

సేవా హై య‌జ్ఝ కుండ్ స‌మిదామే హ‌మ్ స‌బ్ జలే..!

Satyam NEWS

పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలం

Satyam NEWS

చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో తీవ్ర అస్వస్థత

Satyam NEWS

Leave a Comment