42.2 C
Hyderabad
April 26, 2024 17: 34 PM
Slider నల్గొండ

రైతులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

#BobbaBhagyaReddy

రైతు పక్షపాతిగా చెప్పుకొని రైతులను నియంత్రిత సాకువైపు మళ్లించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా  భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు.

దొడ్డు రకం ధాన్యం వేయకుండా సన్నరకం ధాన్యం పంటలు పండించాలని, లేనిపక్షంలో రైతుబంధు రాదని అన్న కేసీఆర్  రైతు పక్షపాతి ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.

రైతులు పండించిన సన్నరకం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి క్వింటా ఒక్కంటికి 2500/- రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని బొబ్బ భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రతి మండల కేంద్రంలో, మేజర్ గ్రామ పంచాయతీలలో ఐకెపి సెంటర్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.

Related posts

అటెన్ష‌న్ డైవ‌ర్ట్ గ్యాంగ్..14 తులాల గోల్డ్ అప‌హ‌ర‌ణ‌

Satyam NEWS

సంచలనం సృష్టించిన కరణం బలరాం కుమార్తె పోస్టర్లు

Satyam NEWS

న్యూ బిగెనింగ్: ఘనంగా మెట్రో క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment