40.2 C
Hyderabad
April 26, 2024 12: 54 PM
Slider పశ్చిమగోదావరి

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

#rytusangham

ఏలూరు జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని రైతాంగ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. శనివారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్రాసిన బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు స్థానిక పవర్ పేట లోని అన్నే భవనంలో  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహా, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలు,వడగళ్ల వానలతో వర్జీనియా పొగాకు, మొక్కజొన్న, మామిడి, మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లి రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.45 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు ఆపాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలన్నారు. దిగుబడులు రాక నష్టపోయిన మొక్కజొన్న విత్తన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని, మొక్కజొన్న సీడ్ కంపెనీల మోసాల అరికట్టాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో వస్తున్న సమస్యలను ముందస్తుగానే పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు సొమ్ములు చెల్లించాలన్నారు.

జిల్లాలో సారవంతమైన భూములను అక్రమంగా ఆక్వా చెరువులుగా మార్చడానికి నిరోధించాలని కోరారు. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి,నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునికరించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన పాడి పశువులకు ప్రమాద బీమా పరిహారం బకాయిలు పాడి రైతులకు అందించాలన్నారు. దొండ పందిళ్లు ఇతర ఉద్యాన పంటల సబ్సిడీ బకాయిల నిధులు, మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిల నిధులు విడుదల చేసి రైతాంగానికి అందించాలని కోరారు.

భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారాలు అందించాలని కోరారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్  కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు సున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూమ్ యాప్ ద్వారా బ్రాహ్మణ వివాహ వేదిక

Satyam NEWS

రోజూ వేధిస్తున్న కొడుకును చంపేసిన తండ్రి

Satyam NEWS

మినిస్టర్స్ వాయిస్: పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం

Satyam NEWS

Leave a Comment