42.2 C
Hyderabad
April 26, 2024 17: 30 PM
Slider జాతీయం

ములాయం అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ చంద్రబాబు

#mulayam

సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరుగుతున్నాయి. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణానికి యూపీలో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.

ములాయం సింగ్ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు కూడా సైఫాయ్ వెళ్లి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ను పరామర్శించారు. అఖిలేష్ యాదవ్ ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితి, గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తదితరులు కూడా ఉన్నారు.

కాన్పూర్‌లో నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మరణవార్త విన్న కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. రాజేష్ కుమార్ యాదవ్ (50) ఇస్పాత్ నగర్‌లో కూలీగా పనిచేసేవాడు. సోమవారం పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసింది. దీనిపై ఆయన తీవ్ర స్థాయిలో బాధపడ్డాడు. దాంతో అతను పాండు నదిలో దూకాడు. రాజేష్ యాదవ్ మృతితో భార్య రమ్రతి, నలుగురు మైనర్ కుమార్తెలు మమత, లలిత, సరిత, ఆరుషిల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. అన్నయ్య రాజేష్‌కి నేతాజీకి చాలా అనుబంధం ఉందని సోదరుడు అమర్ బహదూర్ చెప్పారు. ఆయన మరణ వార్త విని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Related posts

ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలి

Satyam NEWS

డయల్100 ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి హాఫ్ మారథాన్ లో రికార్డు

Satyam NEWS

సోమశిల మునక ప్రాంతంలో రగడ: అధికారుల అడ్డగింత

Satyam NEWS

Leave a Comment