23.7 C
Hyderabad
August 10, 2020 04: 19 AM
Slider ఆదిలాబాద్

నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ సిక్తా

#Collector Siktha

గిరిజనుల ఆరాధ్య దేవత నాగోబా ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రోజున ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవాలయం ను కలెక్టర్ సందర్శించి పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక అధికారులు,ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ను ఆహ్వానించారు.

ప్రత్యేక పూజా లు నిర్వహించిన తర్వాత దేవాలయ నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు ధరించాలని, తరచుగా సానటైజేర్ తో చేతులు శుభ్రపరచుకోవాలని తెలిపారు.

 ఆదివాసీ సమస్యలపై  సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేందర్ రావు, ఎంపీడీఓ రమాకాంత్, సర్పంచ్ రేణుక, జడ్పీటీసీ పుష్పాలత,పటేల్ వెంకట్రావు, గిరిజన పెద్దలు సిడం భీంరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూముల విలువ పెంచేందుకే గ్రాఫిక్స్ రాజధాని

Satyam NEWS

సైరా చిత్రాన్ని మెచ్చుకున్న గవర్నర్ తమిళిసై

Satyam NEWS

విజన్ డాక్యుమెంట్: స్థానిక సంస్థలకు అధికారాలేవి?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!