38.2 C
Hyderabad
April 29, 2024 12: 58 PM
Slider ముఖ్యంశాలు

చినజీయర్‌స్వామిపై ఫిర్యాదు

complaint against chinjiyar swami

ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్‌స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ డివిజన్‌ అధ్యక్షుడు మల్లుదొర తెలిపారు. అడవి బిడ్డలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన జీయర్‌స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా చినజీయర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క కూడా మండిపడ్డారు. ‘‘మా తల్లులది వ్యాపారమా?… మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా?… మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు, కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడ్డానికి  150 రూపాయలు టికెట్ ధర పెట్టారు. ఎవరిది వ్యాపారం? సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’’ అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS

మోడల్స్ మృతిలో మిస్టరీ.. సంచలనంగా చివరి ఇన్స్టా పోస్ట్

Sub Editor

Leave a Comment