42.2 C
Hyderabad
April 26, 2024 16: 26 PM
Slider ముఖ్యంశాలు

కన్ఫ్యూజన్: తికమక వ్యవహారంలో చిక్కుకున్న పాలనాయంత్రాంగం

amaravathi

అమరావతి నుంచి రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు అత్యంత సంక్లిష్టమైన ఈ మూడు అంశాలను ఒకే సారి నెత్తిన వేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి క్లారిటీ ఉందేమో కానీ సంబంధిత శాఖలకు చెందిన ఏ అధికారికీ ఈ మూడు అంశాలపై క్లారిటీ లేదు.

అన్ని అంశాలూ ఒకదానిపై ఒకటి అమలు చేయాల్సిన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం తీవ్ర వత్తిడిలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లో ఎలాంటి క్లారిటీ లేకుండా ఆదరాబాదరా నిర్వహిస్తున్నారు. నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయని కారణాన్ని పైకి తీసుకువచ్చి సత్వర నిర్ణయాలు తీసేసుకున్నారు.

అదే విధంగా అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా తరలింపు ప్రక్రియను అనధికారికంగా చేసేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల వంతు వచ్చింది. ఈ నెలాఖరులోకా కొత్త బడ్జెట్ కు ఆమోదం తెలుపకపోతే ప్రభుత్వ యంత్రాంగం నిలిచిపోతుంది.

అందుకోసం ఇప్పుడు పై రెండు సమస్యలకు తోడు మూడో సమస్యను తలకెత్తుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండా అమరావతి తరలిస్తున్నట్లు, క్లారిటీ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు.

మరీ ముఖ్యంగా కౌన్సిల్ రద్దు కోసం కేంద్రాన్ని ప్రతిపాదన పంపినందున కౌన్సిల్ ను పిలవకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వీలు ఉందేమో చూడాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తొలి రోజు ఉభయ సభలు అంటే అసెంబ్లీ, కౌన్సిల్ రెంటిని కలిపి కూర్చోబెట్టి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే కౌన్సిల్ రద్దుకు ప్రతిపాదన పంపినందున కౌన్సిల్ ను పిలుస్తారో లేదో ఇప్పుడు కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. కౌన్సిల్ రద్దు ప్రక్రియకు పార్లమెంటు ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించనందున ఇంకా కౌన్సిల్ ఉందని, అందువల్ల కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయడం తప్పని సరి అని రాజ్యాంగ నిపుణులు అంటున్నా కౌన్సిల్ ను సమావేశపరచకుండా కేవలం అసెంబ్లీనే పిలిచే అవకాశం ఉందా అని ముఖ్యమంత్రి కార్యాలయం విచారణ జరుపుతున్నది.

మార్చి 31 లోపు కౌన్సిల్ లో బడ్జెట్ ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ చూస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో తెలియడం లేదు. ఇప్పటి వరకూ చాలా వివాదాస్పద నిర్ణయాలను ఏకపక్షంగా తీసేసుకున్నట్లు బడ్జెట్ సమావేశాల విషయంలో కుదరకపోవచ్చు.

Related posts

మరో సీనియర్ నేత బీఆర్ యస్ కు గుడ్ బై

Satyam NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది

Satyam NEWS

కరోనా 3వ దశకు సూర్యాపేట ఎలా వచ్చిందంటే?

Satyam NEWS

Leave a Comment