ఎవరు మంత్రులుగా ఉన్నా.. జనానికి ఒరిగేదేమీ ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియా ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తావన తెచ్చారు. ఈటల టీఆర్‌ఎస్‌కు ఓనరేనని.. పార్టీకోసం ఎంతో పనిచేశారుని డబ్బులు కూడా ఖర్చుపెట్టారని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బతుకుదెరువు కోసమే తాను గతంలో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లానని.. ఎవరు మంత్రులుగా ఉన్నా జరిగేది ఏముండదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మంత్రిగా ఉండి జనానికి తాను చేసిందేంటో అందరికీ తెలుసన్నారు. ‘ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారు. వందల మంది జ్వరాలతో చనిపోతుంటే ఎవరి మీద కేసులు పెట్టాలి. బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవా?. అధికారులు నిధులు లేవు అంటున్నారు.. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు’ అని సర్కార్‌ను జగ్గారెడ్డి ప్రశ్నించారు.
previous post
next post