32.7 C
Hyderabad
April 27, 2024 00: 11 AM
Slider నల్గొండ

అమర వీరులకు కాంగ్రెస్ పార్టీ సలామ్

#Hujurnagar Congress Party

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షతన గాంధీ పార్క్ సెంటర్ లో గాంధీ విగ్రహం వద్ద ‘అమరవీరులకు కాంగ్రెస్ సలామ్’ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా భారత్ – చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ స్థానిక నాయకులు ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు జాతీయ జెండాలను చేత భూమి మౌనంగా తమ నిరసనను తెలియచేశారు.

ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, బాచిమంచి గిరిబాబు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి నిజాముద్దీన్, పి ఏ సి ఎస్ జిల్లా డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గల్లా వెంకటేశ్వర్లు మాట్లాడారు.

గత 45 సంవత్సరాలు భారత్ – చైనా సరిహద్దుల్లో ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా ఉంది.ప్రస్తుతం చైనా దేశం భారత్ భూభాగాన్ని ఆక్రమించి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మందిని బలి తీసుకున్నారు అని అన్నారు.

చైనా దుస్సాహసాన్ని అందరూ అడ్డుకోవాలి

నేడు దేశ సరిహద్దుల్లో ఉన్న నేపాల్ భారత భూభాగంలో వారి దేశ మ్యాప్ విడుదల చేయటం పాకిస్థాన్లో యుద్ధవాతావరణం ఉండటం, శ్రీలంక దేశంతో సరైన సంబంధాలు లేకుండా ఉండటం, చైనా దుస్సాహసంగా భారత భూభాగం లోనికి రావటం, ఇటువంటి దయనీయ పరిస్థితి ఏర్పడటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ  అసమర్థ పరిపాలనే కారణమని వారు విమర్శించారు.

భారత్ భూభాగాన్ని ఆక్రమించి న చైనా దేశం తన సైనికులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారత కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు శుక్రవారం నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చక్కెర వీరారెడ్డి, జక్కుల మల్లయ్య, సుంకరి శివరామ యాదవ్, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, తేజావత్ రాజు, కారింగుల విజయ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇంకా, వెల్దండ వీరారెడ్డి, సరితా, ధనమ్మ, శైలు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, సుతారి వేణుగోపాల్, గంగసాని యల్లారెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, ఎండి చాంద్ పాషా, మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు, తండు ప్రసాదు, లచ్చిమళ్ళ నాగేశ్వరరావు, చంద్రశేఖర్, కోలా మట్టయ్య, ములకలపల్లి రామగోపి, షేక్ సైదా, దొంతగాని జగన్ పాల్గొన్నారు.

ఇంకా, పాశం కోటమ్మ, చప్పిడి సావిత్రి, శివ పార్వతి, ముత్తయ్య, నందిగామ శ్రీను, మొదల సైదులు, తండు శ్రీను, గొట్టెముక్కల రాములు, యడవెల్లి వీరబాబు, తమ్మిశెట్టి గోపి, షేక్ ఉద్దండు, రేపాకుల కోటయ్య, అజ్మతుల్లా, చిన్నం శ్రీను, కందుకూరి రాము, కస్తాల రవీందర్, రెడపంగు రాజేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వం అవినీతిపై బీజేపీ చార్జిషీట్

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

Satyam NEWS

ఏపిలో అధ:పాతాళానికి పడిపోయిన బిజెపి గ్రాఫ్

Satyam NEWS

Leave a Comment