28.7 C
Hyderabad
April 27, 2024 04: 30 AM
Slider ఆదిలాబాద్

నిర్మల్ జిల్లా కంటైన్ మెంట్ జోన్ లలో ఆంక్షల సడలింపు

Nirmal Baricades

నిర్మల్ జిల్లాలోని ఏడు నిర్బంధ ( కంటైన్ మెంట్) జోన్ లలో బ్యారికేడింగ్ తీసివేసి సడలింపులు ఇచ్చామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన జోహార్ నగర్ ప్రాంత ప్రజలు కంటైన్ మెంట్ జోన్ నుండి బయటకు రాకుండా ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్ ను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ తొలగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా 16 నిర్బంధ జోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో జోహార్ నగర్, గాజులపేట, కనకా పూర్, రాచాపూర్, న్యూ లింగంపల్లి రాయదారి, కడెం నిర్బంధ జోన్లలలో  పాజిటివ్ కేసు ఒక్కటి  మాత్రమే నమోదయిందని, 14 రోజులుగా పూర్తయినందున ప్రమాణికను తీసుకొని బ్యారికేడ్ లను తొలగించామన్నారు.

జిల్లా నుండి 20 కరోనా పాజిటివ్‌  కేసులను గాంధీ ఆసుపత్రి పంపగా అందులో నుండి ఎనిమిది మంది కోలుకొని డిశ్చార్జ్ అయినారని తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నందున క్రమంగా సడలింపులు ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ లాక్ డౌన్ అమలు ఉంటుందన్నారు.

కలెక్టర్ అనంతరం ప్రసూతి ఆసుపత్రి ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్ , జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ వెంకట్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంత రావ్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ దేవేందర్ రెడ్డి, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, డిఎస్పి ఉపేందర్ రెడ్డి, కమిషన్ బాలకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ సలీం, తాహసిల్దార్ సుభాష్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లీ కొడుకులకు కరోనా సోకిందని… ఇంటి యజమాని…..

Satyam NEWS

టికెట్ కోసం దరఖాస్తు చేసుకోని సీనియర్లు

Bhavani

లియోనియా కార్మికులకు అండగా ఉంటా

Satyam NEWS

Leave a Comment