29.7 C
Hyderabad
April 29, 2024 08: 50 AM
Slider ప్రత్యేకం

మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

#cookingas

గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. 14.2 కేజీల సిలిండర్​ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది.  

హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలెండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

Related posts

ఎమ్మెల్సీ అభ్యర్థిగా దూడపాక సంజీవ నామినేషన్ దాఖలు

Satyam NEWS

వనపర్తి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

Satyam NEWS

శివోహం: సోమశిలలో మార్మోగిన శివనామ స్మరణ

Satyam NEWS

Leave a Comment