40.2 C
Hyderabad
April 26, 2024 14: 28 PM
Slider ముఖ్యంశాలు

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కరోనా మాస్క్ తప్పనిసరి

#Nalgondapolice

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు.

బుధవారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 2,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చే అన్ని రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ లక్ష్యంగా తీసుకుంటున్న  చర్యలలో భాగంగా ఇప్పటి వరకు 37.73 లక్షల రూపాయల అక్రమ డబ్బు పట్టుబడినట్లు చెప్పారు.

అదే విధంగా అక్రమంగా తరలిస్తున్న మూడున్నర లక్షల రూపాయల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు.  రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థులు కళ్యాణ మండపాలు అనుమతి లేకుండా తీసుకోవద్దని ఆయన సూచించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు పెట్టవద్దని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్లష్టం చేశారు.

నెంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి వాహనాలు రోడ్ల పై తిరగవద్దని, అలా తిరిగే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉప ఎన్నికల కోసం ఉత్తరాఖండ్ కు చెందిన సీనియర్ అధికారిని పోలీస్ శాఖ తరఫున పరిశీలకునిగా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిందని తెలిపారు. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా చేస్తూ ఎవరు పట్టుబడినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉప ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలంతా ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్చందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని రాజ్యాంగ స్పూర్తిని చాటాలని కోరారు.

ప్రచార పర్వంలో మాస్క్ మస్ట్

సాగర్ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో బహిరంగ సభలకు వచ్చే ప్రజలు, నాయకులు విధిగా మాస్కులు ధరించడంతో పాటు కరోనా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలతో పాటు కేసులు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 39 పోలింగ్ రూట్లు, 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఇప్పటి వరకు 370 మంది టిఆర్ఎస్, 280   మంది కాంగ్రెస్, 40 మంది బిజెపి పార్టీలకు చెందిన వారితో పాటు మరి కొంత మందిని కలిపి మొత్తం 2,500 మందిని బైండోవర్ చేసినట్లు డిఐజి రంగనాధ్ వివరించారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి..డిఎస్పీ రమణా రెడ్డి, నాగార్జున సాగర్ సిఐ వై. గౌరు నాయుడు, ఎస్.ఐ. నర్సింహా రావు, ఇతర పోలీస్ అధికారులున్నారు.

Related posts

కెనడాలో TDF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి

Satyam NEWS

కొల్లాపూర్ ఎస్ఐ పై దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment