40.2 C
Hyderabad
April 28, 2024 18: 40 PM
Slider ప్రత్యేకం

కరోనా కరోనా కుచ్ భీ నహీ కర్ నా

#Corona Test New

కరోనా వస్తే ఎలా తెలుస్తుంది?

కరోనా వచ్చిన ఇంత కాలానికి ఇలాంటి ప్రశ్న వేస్తున్నావు, ఆ మాత్రం తెలీదా?

నాకు తెలుసు కానీ నువ్వు చెప్పు.

ఏముంది రోగ లక్షణాలు ఉంటే కరోనా పరీక్ష చేయించుకోవాలి.

కరోనా పరీక్ష చేయించుకుంటే రిపోర్టు వస్తుందా?

కచ్చితంగా వస్తుంది.

నీకో విషయం చెప్పేదా? నువ్వు తెలుగు రాష్ట్రాల్లో నివాసం ఉండే వాడివైతే కరోనా టెస్టు చేయించుకోకపోయినా రిపోర్టు వస్తుంది తెలుసా?

నిజమా?

కావాలంటే కరీంనగర్ కు చెందిన ప్రసాద్ ను అడుగు, లేదా ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మిని అడుగు….

కరీంనగర్ కు చెందిన ప్రసాద్ ఒక బ్యాంకు ఉద్యోగి. అతనికి జ్వరం ఇతర లక్షణాలు వచ్చాయి. దాంతో కంగారు పడి కరోనా టెస్టుకు వెళ్లాడు. టెస్టు కిట్లు లేవు రేపు రా అన్నారు.

మళ్ళీ వెళ్లాడు. అదే సమాధానం. కంప్యూటర్ లో పేరూ ఊరూ నమోదు చేయించుకుని పో అని చెప్పారు అక్కడి సిబ్బంది. టెస్టు కిట్లు రాగానే ఫోన్ చేస్తారు కాబోలు అంటూ అన్ని వివరాలు ఇచ్చి వచ్చాడు. నాలుగు రోజులైంది. ఉలుకూలేదు పలుకూ లేదు. ఈ లోపు జ్వరం తగ్గింది. ఇతర లక్షణాలు కూడా తగ్గిపోయాయి.

ప్రసాద్ జరిగిన సంఘటన మొత్తం మర్చిపోయాడు. ఇంతలో ఒక ఎస్ ఎం ఎస్ వచ్చింది. ‘‘ప్రసాదూ, ఇదిగో నీ టెస్టు రిపోర్టు. నీకు కరోనా నెగెటీవ్ వచ్చింది’’ అంటూ. నేను అసలు టెస్టుకే వెళ్లలేదు, ఇదేమిటిరా బాబూ అనుకుంటూ బోగస్ టెస్టు రిపోర్టు అయినా నెగెటీవ్ వచ్చింది కదా అని ప్రసాద్ సంతోష పడ్డాడు.

అదే పాజిటీవ్ అని వచ్చి ఉంటే ప్రసాద్ పని చేసే బ్యాంకు మూసేయాల్సి వచ్చేది. ప్రసాద్ కుటుంబ సభ్యులు క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చేది. అతడిని గత పది రోజుల్లో కలిసిన వారంతా భయపడి చావాల్సి వచ్చేది…… ప్రసాద్ భయపడి ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి ఉంటే కనీసంలో కనీసం 18 లక్షలు బొక్కపడేది.

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం జంపాల వారి పల్లె కు చెందిన లక్ష్మి కి ఏ జబ్బూ లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా విషయమే వారికి తెలియదు. ఒక రోజు అంగన్ వాడీ ఆయాలు, విలేజ్ వాలెంటీర్లు వచ్చారు. తలుపు తట్టారు. ‘‘సారీ మేడమ్.. మీకు కరోనా పాజిటీవ్ వచ్చింది. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటూ చెప్పడం మొదలు పెట్టారు. అసలు వారేం చెబుతున్నారో లక్ష్మికి అర్ధం కాలేదు.

మీరు ఎవరు ఎందుకు వచ్చారు? నాకు కరోనా ఏమిటి? నేను అసలు గడప దాటి బయటకే వెళ్లలేదు. నేను అసలు కరోనా టెస్టు చేయించుకోలేదు అని లక్ష్మి వాపోయింది….. దాంతో వచ్చిన వాలంటీర్లు, ఆయాలు మౌనంగా వెనక్కి తిరిగి వెళ్లారు. అయ్యా, ఇదీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల పరిస్థితి.

తెలంగాణ లో కరోనా టెస్టులే చేయరు. ఆంధ్రాలో టెస్టు చేయించుకోకపోయినా రిపోర్టు ఇచ్చేస్తారు. పైన చెప్పినవి కేవలం రెండు సంఘటనలు మాత్రమే కావచ్చు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో? కరోనా అంటే అందరూ ఆషామాషీగా తీసుకుంటున్నారు…. ముఖ్యంగా పాలకులు.

Related posts

ఏపి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం

Satyam NEWS

గదుల్లో పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లు..రోడ్ల మీద‌కు….!

Satyam NEWS

పుట్టిన రోజు తల్లి సమక్షంలో మోడీ

Satyam NEWS

Leave a Comment