32.7 C
Hyderabad
April 27, 2024 02: 03 AM
Slider రంగారెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూర్ లో కరోనా సేవలు ప్రారంభం

#MinisterSabita

కరోనా బారిన పడిన వారికి తాండూర్ లోనే వైద్య సేవలు అందించడo జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి   సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు హైదరాబాద్ కు వెళ్లకుండా  తాండూరులోనే  వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వంద బెడ్లు ఏర్పాటు చేసినట్లు,  హైదరాబాద్ రోడ్డు మార్గం లో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తునట్లు పేర్కొన్నారు.

తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్  ను అందుబాటులో కి తీసుకురావాలని మంత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున ను ఆదేశించారు.

అదేవిధంగా వికారాబాద్ లోని మహావీర్ హాస్పిటల్ లో 150 బెడ్లు  కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని వివరించారు.

మే ఒకటవ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.  గ్రామస్థాయిలో అధికారులు ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా కరొనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఆక్సిజన్ అందుబాటులో ఉండాలని వైద్యులకు ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు,  తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ,  జిల్లా గ్రంధాలయ చైర్మన్  మురళి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ స్వప్న , వైస్ చైర్మన్ దీపా, తాండూరు డిఎస్పి లక్ష్మి నారాయణ,యాలాల ఎంపీపీ బాలేస్వర్ గుప్తా , మార్కెట్ చైర్మన్ , వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావు కు సన్మానం

Satyam NEWS

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

Satyam NEWS

పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రైతు భూమిలో ప్రత్యర్థుల  రోడ్డు నిర్మాణం

Satyam NEWS

Leave a Comment