బిచ్కుంద మండలంలోని గోపన్ పల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్ బుధవారం ఉదయం బహరేన్ నుండి తన స్వగ్రామం చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సర్పంచ్ కొట్టే శ్రీనివాస్ ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయడంతో సూపర్వైజర్ అనంతలక్ష్మి, ఏఎన్ఎం సుశీల, ఆశ కార్యకర్త అనితతో కలిసి విశ్వనాధ్ ఇంటికి వెళ్లి అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
బహరేన్ నుండి చెన్నై కి విశ్వనాథ్ చేరుకోగా అక్కడ నిర్వహించిన పరీక్షల పత్రాలను పరిశీలించి కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ పదిహేను రోజుల వరకు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండాలని, తన వెంబడి తెచ్చిన వస్తువులను ఐ సొల్యూషన్ చేసిన తర్వాతనే ఇంట్లోకి తీసుకెళ్లాలని, రోజూ ఒక గంట పాటు ఎండ తాకేటట్లు జాగ్రత్త పడాలని జ్వరం, జలుబు, గొంతునొప్పి, తుమ్ములు, దగ్గు వంటి లక్షణాలు కనపడితే వెంటనే ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియజేయాలని విశ్వనాథ్ కు సూచించారు. ఉదయం సాయంత్రం అతనిని పర్యవేక్షణ చేయాలని రోజు అతనికి సంబంధించిన రిపోర్ట్ తెలియజేయాలని ఆశ కార్యకర్తకు సూపర్వైజర్ ఆదేశించారు.