42.2 C
Hyderabad
April 26, 2024 18: 13 PM
Slider నిజామాబాద్

పంటపొలాల్లో సీపీఐ నాయకుల ఒకరోజు నిరాహార దీక్ష

#CPI Nizamabad

రైతుల సమస్యల పై సీపీఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జైనాపూర్ శివారులోని పంట పొలాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి  సుధాకర్, మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ…. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సీపీఐ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్ నియంత్రణపై సేవలందిస్తున్న,పలు ప్రభుత్వ శాఖల సిబ్బందికి ప్రభుత్వం ఒక నెల జీతం బోనస్ అందించాలని కోరారు.రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ సిఫారసు మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని, తరుగు, తాలు పేరుతో సొసైటీలు,రైస్ మిల్లు యజమానులు కుమ్మక్కై రైతులకు చేస్తున్న మోసాన్ని అరికట్టాలని అన్నారు.

కార్మికులకు,వలసకార్మికులకు,చేతివృత్తి దారులకు,అసంఘటిత రంగ కార్మికులకు,రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేరళ ప్రభుత్వం తరహాలో ఏడు వేల రూపాయలు కారోన సహాయం క్రింద వారి బ్యాంక్ ఖాతాలో జమా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నల్ల గంగాధర్, సోమ రాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 31మందికి విముక్తి

Bhavani

గత ఐదేళ్ల అవినీతి, భూకబ్జా పై విచారణ

Satyam NEWS

ప్రజలకు సత్వర సేవలు అందించడంలో బ్లూ కోట్స్ విధులు కీలకం

Satyam NEWS

Leave a Comment