39.2 C
Hyderabad
April 28, 2024 12: 53 PM
Slider ముఖ్యంశాలు

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

#CPMNalgonda

అర్హులైన పేదలను గుర్తించి ఇండ్ల స్థలాలను ఇచ్చి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కలిగించకుండా ప్రభుత్వం తిరిగి తీసుకోవడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు నేరడ నుండి చిట్యాల తహశీల్దార్ కార్యాలయం కార్యాలయం వరకు  చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

చిట్యాల, గుండ్రాంపల్లి,వట్టి మర్తి గ్రామాలలో జరిగే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం పనులు పూర్తి చేసి, మిగిలిన భూమిని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాలకు పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రజలకు ఇచ్చిన హామీ లను విస్మరించారని అన్నారు.

దళితులకు ఇస్తన్న మూడెకరాల భూమి,  ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు నీటి మూటలుగానే ఉన్నా యని అన్నారు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు సకాలంలో ప్రభుత్వం పేదలకు ఇవ్వకపోతే సిపిఎం ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు హెచ్చరించారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వెలిమినేడు గ్రామంలో ఇండస్ట్రీ యల్ పార్క్ పేరుతో పేదల భూములను తీసుకోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అర్వలైన పేదలను గుర్తించి రేషన్ కార్డు లు, పింఛన్ లు మంజూరు చేయాలని కోరారు.

చిట్యాల, నేరడ, ఆరెగూడెం, చిన్నకాపర్తి, ఉరుమడ్ల తదితర గ్రామాలలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. పాదయాత్ర బృందానికి  కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాక వెంకట్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు శేపూరి సుదర్శన్, నేరడ సర్పంచ్ దుబ్బాక శోభ, ఉపసర్పంచ్,

చిట్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, చిట్యాల కాంగ్రెస్  కౌన్సిలర్లు రెమిడాల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాసరెడ్డి, జంపాల వెంకన్న తదితరులు పాల్గొని స్వాగతం పలికి పూలమాలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య,

జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, బొజ్జ చినవెంకులు, నారబోయ్న శ్రీనివాసులు, పామనగుళ్ల అచ్చాలు, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహ, కత్తుల లింగస్వామి, అరూరి శీను, రాచకొండ శ్యామ్ సుందర్, రుద్రారపు పెద్దులు, లడే రాములు, జిట్ట సరోజ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మల్లం మహేష్, బడే అజయ్ కుమార్, జోగు లక్ష్మయ్య,

ఈసం రాజు, మెట్టు నర్సింహ, పరమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర లో సీతారాములు సతీమణి సుశీల, కోడలు ధనలక్ష్మీ, కొడుకు కిరణ్ తోపాటు మనుమలు కూడా నడవటం విశేషం. ప్రజా నాట్యమండలి కళా కారుల  డప్పు, పాటల ప్రదర్శనలు బాగా ఆకట్టుకున్నవి.

Related posts

దిశ హత్యపై సత్తెనపల్లిలో విద్యార్ధుల నిరసన

Satyam NEWS

వల్గర్ ఫాదర్:కన్నతండ్రే కామాంధుడయ్యాడు

Satyam NEWS

Analysis: యువత మనసు ఎరగని ‘మన్ కి బాత్’

Satyam NEWS

Leave a Comment