ఈ నెల 27 న చెన్నైలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ 11 వ స్టాండింగ్ కమిటి సమావేశంలో చర్చించే విషయాలకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు.
శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సి.యస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, అధర్ సిన్హా, శాలిని మిశ్రా, శాంతికుమారి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, వికాస్ రాజ్, జయేష్ రంజన్, రాజీవ్ త్రివేది, పార్ధసారధి, జగధీశ్వర్, సబ్యసాచి ఘోష్, కార్యదర్శులు బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, బి.వెంకటేశం, నవీన్ మిత్తల్ , సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ డి.జి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎజెండా ఆంశాలైన పరిపాలన సంస్కరణలు, ఇ ఆఫీస్ వెబ్ సైట్లకు GIGW నిబంధనల అమలు, ఇ గవర్నెన్స్ అవార్డులకు నామినేషన్ లు, జననీ శశు సురక్ష కార్యక్రమం, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం, పోలీసు శాఖ ఆధునీకరణ, డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ మిషన్ అమలు, మహిళలు, చిన్నారులపై లైంగిక కేసుల విచారణ వేగవంతం, నిక్షయ్ పోషణ్ యోజన అమలు, పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ అమలు, అటవీ వణ్య ప్రాణ అనుమతులు మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలపై వివిధ శాఖలు స్టాటస్ నోట్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ffffffffff