42.2 C
Hyderabad
April 26, 2024 18: 11 PM
Slider ముఖ్యంశాలు

రామతీర్ధం రామా.. నీ తల నరికిన వారిని నీవే పట్టివ్వు… మా వల్ల కాదు

#Ramateerdham

డిశెంబర్ 28న విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండపై రాములోరి విగ్రహ శిరస్సు కొట్టేసి పదిహేను రోజులు కావస్తోంది. ఇప్పటివరకు చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకలేదు.

రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన విగ్రహ ద్వంసం ఘటనతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150దేవాలయాలలో ఇలానే విగ్రహ ద్వంసం జరిగింది.

అన్ని కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన జగన్ ప్రభుత్వం తొలుత సీఐడికి అప్పగించింది. అనంతరం సిట్ కు అప్పగించినా…ఇంతవరకూ అందుకు గల బాధ్యులను పట్టుకోలేకపోయింది.

రాష్ట్రంలో విగ్రహాల ద్వంసం కేసులు అంశం రావణ కాష్టంలా రగులుతునె ఉంది.ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా  ఎస్పీ ఓ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు.

రామతీర్థం నీలాచలం కేసును సీరియస్ గా తీసుకున్న ఎస్పీ రాజకుమారీ..గ్రామంలో పర్యటించారు. డీఎస్పీ అనిల్ ,విజయనగరం రూరల్ సీఐని వెంట పెట్టు కుని గ్రామంలో యువతను సమావేశ పరిచారు.

ఇందుకు సంబంధించి గ్రామ రక్షక దళాన్ని ఏర్పాటు చేయించారు. గ్రామాన్ని కంటికి రెప్పలా చూసుకుంటామని ఇక నుంచీ ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా కాపాడుకుంటామని యువతతో ప్రమాణం చేయించారు.

గ్రామ రక్షణే సమాజం దేశం యొక్క రక్ష అంటూ యువతచే ప్రమాణం చేయించారు.ఏదైనా నేరపూరిత ఘటన జరిగిన ,అలాంటి చర్యలకు ఎవ్వరు పాల్పడుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలంటూ తెలిపారు.

Related posts

భార్యా భర్త కలిసి గంజాయి సాగుచేస్తున్నారు

Satyam NEWS

నేను రానుబిడ్డో సర్కారు దవఖానకు…

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో వాలంటీర్ మృతి

Satyam NEWS

Leave a Comment