కడప జిల్లా నందలూరు స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభా కార్యక్రమంలో రాజంపేట మాజీ శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఐ.ఏ.యస్, ఐపీఎస్ లకు రాజకీయ ఉద్ధండులకు నెలవైన నందలూరులో పార్లమెంట్ స్థాయిలో ప్రతియేటా క్రీడా, సాంస్కృతిక, కళా, విద్యా రంగాలకు సంబంధించి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఉచిత రీతిన సన్మానించడం గర్వించ దగ్గ విషయం అన్నారు.
ఈ సందర్భంగా వేదికపై సంస్థ అధ్యక్షుడు వేపగుంట సామ్రాజ్యం ను శాలువా కప్పి జ్ఞాపిక తో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ నేత భూమన శంకర రెడ్డి, శ్రీ సౌమ్యనాధ ఆలయ చైర్మన్ సౌమిత్రి, ఐ.కె.పీ.ఎస్ ప్రతినిధి విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.