30.7 C
Hyderabad
April 29, 2024 03: 56 AM
Slider జాతీయం

బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల విమానంలో సీటు కింద దాచి విదేశాల నుంచి కేజీన్నర బంగారాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌కు తీసుకువచ్చారు. అది పసిగట్టిన కస్టమ్స్ అధికారులు.. ఎయిరిండియా ఎయిర్‌లైన్స్ కు చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

దాని విలువ సుమారు రూ. 75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ ముగ్గురు ఉద్యోగులు ఎయిర్‌ ఇండియాలో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ పై పని చేస్తున్నారు. స్మగ్లర్లు ఇలా ఉద్యోగులను తమవైపుకు లాక్కుని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Related posts

తమిళనాడు దాహం తీర్చేందుకు కేసీఆర్ రెడీ

Satyam NEWS

(OTC) Herbal Male Enhancement Cream Ice T And Dr Phil Male Enhancement

Bhavani

ఐకేసీ వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన పిడి

Satyam NEWS

Leave a Comment