35.2 C
Hyderabad
April 27, 2024 12: 19 PM
Slider ప్రపంచం

టర్కీకి దీటుగా సమాధానమిచ్చిన ఎస్ జైశంకర్

#turkey

కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో టర్కీ ప్రస్తావించడాన్ని భారత్ సీరియస్ గా పరిగణిస్తున్నది. కాశ్మీర్ అంశంలో వేరే ఏ ఇతర దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ చాలా కాలంగా చెబుతున్నది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కవుసోగ్లుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోకపోవడంపై టర్కీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వ్యాఖ్యానం చేసింది. అయితే 1974 నుంచి సైప్రస్ ద్వీపంతో ఉన్న సమస్యను టర్కీ పరిష్కరించుకోలేకపోవడాన్ని తాము ప్రస్తావించడం లేదని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కవుసోగ్లుతో సమావేశం లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

కాశ్మీర్ అంశం పై మాట్లాడే సమయంలో సైప్రస్ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు. 1974లో సైప్రస్‌ ద్వీపంలో సైనిక తిరుగుబాటుకు ప్రతిస్పందనగా అక్కడి ఉత్తర భాగాన్ని ఆక్రమించడంతో సమస్య ప్రారంభమైంది. దీనికి గ్రీకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ చెబుతున్నది. సైప్రస్ సమస్య టర్కీకి ఎప్పుడూ తలనొప్పిగా ఉంది, దానిపై స్పందించడానికి ఆ దేశం దూరంగా ఉంటుంది.

ఉక్రెయిన్ వివాదం, ఆహార భద్రత, జి-20 ప్రక్రియలు, గ్లోబల్ ఆర్డర్, నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ మరియు సైప్రస్‌పై చర్చలు జరిగాయని సమావేశం అనంతరం ఎస్ జైశంకర్ ట్వీట్‌లో తెలిపారు. మేము సైప్రస్ సమస్యపై పరిష్కారం గురించి ఆరా తీశాము. ఈ దీర్ఘకాలిక సమస్య ను  పరిష్కరించుకోవాలని టర్కీ కి సూచించాము అని ఆయన తెలిపారు.

Related posts

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుల్ కు జరిమానా

Satyam NEWS

శ్రీలంక తదుపరి ప్రధానిగా రణిల్ విక్రమసింఘే

Satyam NEWS

ఇరాన్‌లో యూనివర్సిటీ విద్యార్ధుల తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment