32.7 C
Hyderabad
April 27, 2024 01: 44 AM
Slider పశ్చిమగోదావరి

దళిత వి ఆర్ ఓ లను తప్పించి అగ్రవర్ణాలకు బాసటగా ఉన్నతాధికారి

#pedavegi mandal

దళిత వి ఆర్ ఓ లను తప్పించి అగ్రవర్ణాలకు బాసటగా ఉన్నతాధికారి లంచాలకు మరిగిన ఉన్నతాధికారులు తమ వారిని కాపాడుకుంటూ అమాయకులను బలిపెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో 4గురు దళిత వి ఆర్ ఓ లను విధుల నుంచి తప్పించడం పై ఇప్పుడు ఈ ప్రాంతం అంతా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. నలుగురు దళిత వి ఆర్ ఓలను విధుల నుండి తప్పించి తహసీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేయడం వెనుక కార్యాలయ అధికారుల పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని కొంతమంది వి ఆర్ ఓ లు  బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మండలం లో మొత్తం 5 గురు వి ఆర్ ఓ లు సరెండర్ జాబితాలో ఉండగా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వి ఆర్ ఓ ని మాత్రం సరెండర్ చేయకుండా ఓ అధికారి కావాలనే తప్పించారని సాటి వి ఆర్ ఓ లు ఆ అధికారి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేస్తే మొత్తం 5గురిని సరెండర్ చేయాలని వారిలో నలుగురు దళితులను ఏరి సరెండర్ చేసి, డబ్బుపరంగా, రాజకీయ అధికారిక పలుకుబడి ఉందని అగ్రవర్ణానికి చెందిన విధుల పరంగా తప్పించకుండా ఎలా వదిలేస్తారని అంలున్నారు. వివిధ రకాల ఆరోపణలను ఎదుర్కొంటున్న వి ఆర్ ఓ ని సరెండర్ చేయకుండా తప్పించి ఆర్థిక రాజకీయ పలుకుబడి లేదని 4గురు దళిత వి ఆర్ ఓ లను సరెండర్ చేయడం మండలం లో సంచలనంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారం పై పూర్తి విచారణ జరిపించి తహసీల్దార్ కార్యాలయానికి ఎంతమంది వి ఆర్ ఓ లను సరెండర్ చేశారు. సరెండర్ కాబడిన వారిలో నుండీ ఒక వి ఆర్ ఓ ని ఎందుకు తప్పించారు? కారణాలేమిటి అని కొంతమంది రెవిన్యూ సిబ్బంది ప్రశ్నించుకుంటున్నారు.

Related posts

ఎస్ బి ఐ లోకి చొరబడ్డ దొంగలు: లాకర్ నుంచి సొమ్ము చోరీ

Satyam NEWS

హుజూర్ నగర్ లో వలస కూలీలకు కరోనా పరీక్షలు

Satyam NEWS

ఆర్ఫనేజ్ పిల్లలతో అంబర్పేట్ శంకరన్న పుట్టినరోజు వేడుకలు

Satyam NEWS

Leave a Comment