26.7 C
Hyderabad
April 27, 2024 08: 42 AM
Slider నిజామాబాద్

డబ్బు కోసం: తల్లి శవాన్ని కూడా ముట్టని కూతుళ్లు

మానవ సంబంధాలు మట్టి కలిసిపోతున్నాయి. పేగుబంధం కన్నా డబ్బే ముఖ్యమైంది. ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందగా ఆమె పేరుపై బ్యాంకులో ఉన్న డబ్బు ఇప్పిస్తేనే శవాన్ని తీసుకెళ్తామని కూతుళ్లు తెగేసి చెప్పారు. దాంతో వృద్ధురాలి మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచారు ఆస్పత్రి సిబ్బంది. ఈ హృదయ విధారక ఘటన కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

కామారెడ్డి పట్టణంలోని ఆర్.బి నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ(70)ని గత నెల 21 న ఆరోగ్యం బాగలేకపోవడంతో 108 అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కిష్టవ్వకు ముగ్గురు కూతుళ్లు కాగా ఒక కూతురు మృతి చెందింది. రెండు రోజుల పాటు కిష్టవ్వ కూతుళ్లు ఎల్లవ్వ, పెంటవ్వ ఆమె బాగోగులు చూసుకున్నారు. అయితే వృద్ధురాలు ఆస్తి పంపకాలు చేయలేదు.

అలాగే కిష్టవ్వ పేరుమీద బ్యాంకులో లక్ష 70 వేలు ఉన్నాయి. ఆ డబ్బుకు కిష్టవ్వ బంధువు ఒకరు నామినీగా ఉన్నారు. అయితే ఆ డబులు తమకు ఇవ్వాలని ఆస్పత్రిలోనే వృద్ధురాలితో కూతుళ్లు వాగ్వాదానికి దిగారు. వృద్ధురాలు ఒప్పుకోకపోవడంతో ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. దాంతో కిష్టవ్వకు ఆస్పత్రి సిబ్బందే సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నారు. చికిత్స పొందుతున్న కిష్టవ్వ శనివారం రాత్రి 9:30 ప్రాంతంలో మృతి చెందింది. కిష్టవ్వ మృతి చెందిన విషయాన్ని ఆస్పత్రి వైద్యులు కూతుళ్లకు సమాచారమిచ్చారు.

అయితే బ్యాంకులో ఉన్న లక్ష 70 వేలు ఇప్పిస్తేనే శవాన్ని తీసుకువెళ్తామని చెప్పడంతో చేసేదేమీ లేక పోస్టుమార్టం గదిలోని ఫ్రీజర్ లో కిష్టవ్వ మృతదేహాన్ని భద్రపరిచారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే కిష్టవ్వ మృతదేహం ఉంది. రేపటి వరకు వేచి చూసి వృద్ధురాలి అంత్యక్రియల విషయంలో ఆస్పత్రి వైద్యులు, పోలీసులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related posts

నూరు శాతం జనన,మరణాల నమోదు జరిగేలా చూడాలి

Bhavani

పెళ్లి చేసుకోకుండా ప్రియురాలికి మొహం చాటేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

Satyam NEWS

Leave a Comment