39.2 C
Hyderabad
April 28, 2024 14: 54 PM
Slider ముఖ్యంశాలు

ఏపిలో నాలుగు రోజుల పాటు బయటకు రావద్దు

temparature

ఐఎండి సూచనల ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు  నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్  తెలిపారు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి,  డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని కోరారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శనివారం పార్వతీపురం మన్యం 12, విజయనగరం 9, అనకాపల్లి 8,  అల్లూరి సీతారామరాజు 6, కాకినాడ 3 మిగిలిన చోట్ల అక్కడక్కడ మొత్తం 41 మండలాల్లో  వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

Related posts

రాబోయే కాలంలో క్రీడా రంగానికి పెద్ద పీట

Satyam NEWS

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

Satyam NEWS

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

Satyam NEWS

Leave a Comment