Slider తెలంగాణ

హన్మకొండ చిన్నారి రేప్ కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Murder and rape

సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణను 48రోజుల్లోనే పూర్తిచేసి సంచలన తీర్పు చెప్పింది వరంగల్ కోర్టు.  ఈ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు వరంగల్ ఫస్ట్ అడిషనల్ జడ్జ్ జయకుమార్. ఇది క్షమించరాని నేరం అనీ… ముక్కుపచ్చలారని చిన్నారిపై రాక్షసుడిగా ప్రవర్తించి ఆమె ప్రాణాలు తీసిన నిందితుడికి బతికే హక్కే లేదని న్యాయమూర్తి చెప్పారు. జూన్ 18వ తేదీన హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేశాడు నిందితుడు పోలపాక ప్రవీణ్. రాత్రి డాబాపై తల్లిదండ్రులతో కలిసి పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. తల్లిదండ్రులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసులు పెట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. 23 రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. కోర్టులో జులై 24న ప్రారంభమైన విచారణ… ఆగస్ట్ 2 వరకు కొనసాగింది. తొలి విచారణలో చిన్నారి మేనమామ, తల్లిని విచారించింది కోర్టు. 51 మంది సాక్షులున్న ఈ కేసులో ముఖ్యమైన 30 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మొత్తం ఆరురోజల పాటు విచారణ జరిగింది. నిందితుడి పక్షాన వాదించేందుకు లాయర్లు ముందుకురాకపోవడంతో… ప్రభుత్వమే ఓ న్యాయవాదిని నియమించింది. విచారణ సందర్భంగా తాను నేరం చేసినట్టు నిందితుడు ప్రకాశ్ అంగీకరించాడు. అందరి వాదనలు విన్న వరంగల్ అడిషనల్ కోర్టు… ఇవాళ తుదితీర్పు చెప్పింది. ప్రవీణ్ ను దోషిగా నిర్ధారిస్తూ… మరణశిక్ష విధించింది.

Related posts

డీజీపీ సునీన్ కుమార్ పై చర్య తీసుకోక తప్పదా?

mamatha

ఓ పాలకులారా… ఈ గ్రామాన్ని చూసి సిగ్గుపడండి

Satyam NEWS

ఛీటింగ్: శ్రీశైలం మల్లన్న దొంగలు దొరికారు

Satyam NEWS

Leave a Comment